ట్రెండీ టాపిక్.. బర్నింగ్ టాపిక్.. కరెంట్ అఫైర్ లేదా ఇంకేదైనా అగ్గి రాజేసే ఎలిమెంట్ ని తీసుకోవడం దానిపై సినిమా తీసేయడం ఆర్జీవీ స్టైల్. నచ్చినట్టు తీస్తాడు.. నచ్చినవాళ్లు చూస్తే చాలు! అన్నది ఆయన మోటో. అందుకు తగ్గట్టే ఆయన ఎంచుకుంటున్న కథాంశాలు ఎంతో సింపుల్ గా ఫన్నీగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తీసే విధానంలో ఫెయిల్యూర్ ఎదురవుతోందే తప్ప ఆడియెన్ ఎటెన్షన్ మాత్రం ఎప్పుడూ గురి మిస్సవ్వడం లేదు. ప్రచారార్భాటంతో ఏదో ఒక మ్యాజిక్ చేస్తున్నారు ఆర్జీవీ.
ఈసారి సడెన్ గా `ఆర్జీవీ మిస్సింగ్` అంటూ కొత్త మూవీని ప్రకటించాడు. పీకే ఫ్యాన్స్ .. మెగా ఫ్యామిలీ.. మాజీ సీఎం ఆయన కొడుకు వల్లనే మిస్సయ్యాను! అంటూ ఆసక్తికర క్యాప్షన్ తో రక్తి కట్టించేశాడు. లాక్డౌన్ సమయంలో డబ్బు సంపాదించడం ఎలానో నేర్పిస్తున్న ఫిల్మ్ మేకర్ గా మరోసారి కొత్త ఎత్తుగడతో వస్తున్నాడు. మరి ఈ ప్రయత్నం సఫలమవుతుందా? అన్నది అటుంచితే ఇప్పటికే నాలుగు లుక్ లు వదిలాడు. ఇప్పుడు ఐదో లుక్ ని కూడా రిలీజ్ చేసాడు. ఈసారి మిస్సయిన ఆర్జీవీని వెతుకుతున్నది ఎవరంటే ఆఫీసర్ గజనీకాంత్ అంటూ ప్రకటించాడు. గజినీకాంత్ పాత్రధారి పోలీస్ అధికారిగా సీరియస్ ఎక్స్ ప్రెషన్ లో ఫన్ జనరేట్ చేయడం బావుంది. ఎవరితో అయినా పోలిక సరితూగితే అది యాక్సిడెంటల్ అంటూ వర్మ ప్రచారం ఊదరగొట్టేస్తున్నాడు.
ఆర్జీవీ మిస్సింగ్ తన ఇటీవలి సినిమాల మాదిరిగా షార్ట్ ఫిల్మ్ అని అర్థమవుతోంది. పోస్టర్లు ఫన్నీగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ పోస్టర్లలో ఆర్జీవీ ఎక్స్ ప్రెషన్ కామిక్ స్టైల్లో ఆకట్టుకుంటోంది. ఇందులో సత్య చిత్ర నిర్మాత స్వయంగా నటిస్తుండడం ఆసక్తికరం. ఇక ఈ మూవీతో పాటు ఇతర సినిమాలను విడుదల చేయడానికి ఆర్జీవీ ఆలోచిస్తున్నారట. అంతేకాదు ఇకపై సెలబ్రిటీలపై ఎప్పటికీ సినిమా చేయకూడదని ఆర్జీవీ నిర్ణయించుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందువల్ల అతను ఉదయ్ కిరణ్ జీవిత కథతో తీసే సినిమాను ఆపేసాడట. థియేటర్లు తెరవనంత కాలం ఆర్జీవీ హవా ఇలా కొనసాగడం ఖాయంగానే కనిపిస్తోంది.