'ఆర్జీవీ మిస్సింగ్' థర్డ్ లుక్.. ఈసారి మెగాస్టార్ ని టార్గెట్ చేశాడుగా...!
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రపంచంలోనే మొదటిసారిగా ఫిక్షనల్ రియాలిటీ(FR) జోనర్ లో ''ఆర్జీవీ మిస్సింగ్'' అనే సినిమా తెరకెక్కిస్తున్న చేసిన సంగతి తెలిసిందే. తాను మిస్సైన ఘటనకు సంబంధించిన సినిమా అని.. దీనికి పవర్ ఫుల్ స్టార్ ఫ్యాన్స్ - మెగా ఫ్యామిలీ - మాజీ ముఖ్యమంత్రి మరియు పప్పు అని పిలవబడే ఆయన కుమారుడు అనుమానితులని పేర్కొన్నాడు. ఇప్పటికే 'ఆర్జీవీ మిస్సింగ్' కు సంబంధించిన రెండు పోస్టర్స్ విడుదల చేశారు వర్మ. ఫస్ట్ లుక్ పోస్టర్ లో రామ్ గోపాల్ వర్మ చేతులకు బేడీలు తగిలించుకొని కనిపించాడు. సెకండ్ లుక్ పోస్టర్ లో మొదటి నిందితుడు అంటూ పవర్ ఫుల్ స్టార్ పీకే ని పరిచయం చేశాడు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి థర్డ్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ ద్వారా రెండవ నిందితుడిని పరిచయం చేసిన వర్మ.. అతను ఎవరినైనా పోలి ఉన్నాడా? అని ట్వీట్ చేశాడు. ఈ పోస్టర్ లో టీవీలో 'ఆర్జీవీ కిడ్నాప్ అయ్యాడు.. పీకే ఫ్యాన్స్ - మెగా ఫ్యామిలీ - మాజీ ముఖ్యమంత్రి మరియు ఆయన కుమారుడు అనుమానితులు' అని బ్రేకింగ్ న్యూస్ వస్తున్నట్టుగా డిజైన్ చేశారు. ఈ పోస్టర్ లో ఉన్న వ్యక్తి మీడియా ప్రతినిధులకు దండం పెడుతూ కనిపిస్తున్నాడు. దీనికి నెటిజన్స్ ఆయన మెగాస్టార్ అంటూ కామెంట్స్ పెడుతున్నాడు. రేపు సాయంత్రం 5 గంటలకు మరో పోస్టర్ ను విడుదల చేయనున్నాడు వర్మ. మరి అందులో ఎవరిని టార్గెట్ చేస్తాడో చూడాలి. ఈ చిత్రంలో ప్రవన్ కళ్యాణ్ - ఒమేగా స్టార్ - సీబెఎన్ (CBEN) - లాకేష్ - WHY S జగన్ - KCAR - KTAR నటిస్తున్నారని ఇప్పటికే వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే.