ఆర్జీవీ తగ్గేదే లే.. మంత్రి పేర్ని నానికి మరికొన్ని ప్రశ్నలు..!

Update: 2022-01-05 08:30 GMT
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల వ్యవహారంతో ఇప్పుడు టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అనే విధంగా పరిస్థితులు క్రియేట్ అయ్యాయి. టికెట్ ధరలు నియంత్రిస్తూ సర్కారు తీసుకున్న నిర్ణయం మీద సినీ ప్రముఖులు - వైసీపీ నాయకుల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదనలు జరుగుతున్నాయి. దీని మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తుండగా.. విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దీనిపై తనదైన శైలిలో స్పందించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో గత మూడు నాలుగు రోజులుగా ఏపీ ప్రభుత్వం మరియు సినిమాట్రోగ్రఫీ మంత్రి పేర్ని నాని పై ప్రశ్నల వర్షం కురిపించారు ఆర్జీవీ.

అయితే మంగళవారం రామ్ గోపాల్ వర్మ ‘ఏపీ ప్రభుత్వానికి పది ప్రశ్నలు’ అంటూ పోస్ట్ చేసిన వీడియోపై తాజాగా పేర్ని నాని స్పందించిన సంగతి తెలిసిందే. ''రూ.100 టికెట్‌ను రూ.1000 - రూ.2000కు అమ్ముకోవచ్చని ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్‌ మెకానిజం అంటారు? డిమాండ్‌ - సప్లయ్‌ అంటారా? లేక బ్లాక్‌ మార్కెటింగ్‌ అంటారా?.. గత 66 సంవత్సరాలుగా చట్టాలకు లోబడే ప్రభుత్వాలు ధర నిర్ణయిస్తున్నాయి. కానీ ఇప్పుడు సామాన్యుడి అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి ఉండకూడదనే ప్రభుత్వం సినిమా టికెట్‌ ధరల తగ్గింపు నిర్ణయం తీసుకుంది.. బలవంతంగా ధరలు తగ్గిస్తే ప్రోత్సాహం తగ్గుతుందన్నారు. ప్రోత్సాహం తగ్గేదెవరికి.. కొనేవారికా? లేక అమ్మేవారికా? నిర్మాతల శ్రేయస్సు తప్ప ప్రేక్షకుల గురించి ఆలోచించరా?.. వైద్యం, విద్య మాదిరిగా రాయితీని ప్రభుత్వం భరించాలన్నారు.. సినిమాను నిత్యావసరంగా లేదా అత్యవసరంగా గానీ మేం భావించడం లేదు. మీరు ఎంతవరకు ప్రొడ్యూసర్స్‌ శ్రేయస్సు గురించే మాట్లాడుతూ కన్స్యూమర్ యాంగిల్‌ ను గాలికి వదిలారు. కాస్త ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండి వర్మ గారూ '' అంటూ పేర్ని నాని ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నాని సమాధానాలపై రామ్ గోపాల్ వర్మ ప్రశ్నలు సంధించారు. 'గౌరవనీయులైన సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారు ట్విట్టర్ ద్వారా నన్ను అడిగిన ప్రశ్నలకి నా సమాధానం' అంటూ వరుస ట్వీట్స్ చేసారు ఆర్జీవీ.

* నాని గారు.. చాలా మంది లీడర్లలా పరుష పదజాలం తో మాట్లాడకుండా డిగ్నిటీ తో సమాధానం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండీ..ఇక విషయానికి వస్తే వంద రూపాయల టికెట్ ని వెయ్యికి అమ్ముకోవచ్చా? అన్నది క్వశ్చన్ కాదండీ ..అది అమ్మేవాడి నమ్మకం..కొనేవాడి అవసరం బట్టి ఉంటుంది

* మీరు ఎడారి లో నీళ్ళు లేని పరిస్థితి లో ఉన్నప్పుడు గ్లాస్ నీళ్ళు 5 లక్షలకి కొనచ్చు. కానీ అది పరిస్థితిని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అనుకుంటే మార్కెట్ అనేది ఉన్నదే దానికి .. కార్ కావాలనే కోరికని ఎక్స్ప్లాయిట్ చెయ్యడానికే రకరకాల లగ్జరీ కార్లు తయారు చేసి ఆకర్షిస్తారు. అది తప్పని గవర్నమెంట్ వాటికి అడ్డు కట్ట వేస్తే మనం ఇప్పటికీ కాలి నడకన తిరుగుతూ ఉండేవాళ్ళం.

* ముడి పదార్థం 500 రూపాయలు కూడా ఖర్చవ్వని ఒక పెయింటింగ్ ని ,కొనేవాడుంటే 5 కోట్లకి అమ్ముతారు. ముడి పదార్థానికి మాత్రమే వాల్యూ ఇస్తే దాంట్లో ఉన్న బ్రాండ్ కి, ఐడియా కి ఎలా వెల కడతారు? క్వాలిటీ ఆఫ్ లైఫ్ అడ్వాన్స్మెంట్ అనేది కంటిన్యువస్ గా అన్ని వస్తువులు ఇంకా, ఇంకా బెటర్ గా ఉండేలా ప్రయత్నించడం.. బెటరా అవునా కాదా అనేది కొనుగోలుదారుడు నిర్ణయిస్తాడు.

* కొనేవాడికి అమ్మేవాడికి మధ్య ట్రాన్సాక్షన్ ఎంతకి జరిగిందనే ట్రాన్స్పరెన్సీ మాత్రమే ప్రభుత్వాలకి అవసరం ..ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన టాక్స్ కోసం. బ్లాక్ మార్కెటింగ్ అనేది గవర్నమెంట్ కి తెలియకుండా చేసే క్రైమ్ ..ఓపెన్ గా ఎంతకి అమ్ముతున్నాడో చెప్పి అమ్మితే అది తప్పెలా అవుతుంది

* ఉదాహరణకి మీకు తెలుసో తెలియదో బాంబే ఢిల్లీ లలో వీక్ డే బట్టి, థియేటర్ బట్టి, ఏ సినిమా అనేదాన్ని బట్టి టికెట్ ప్రైజ్ లు 75 రూపాయల నుండి 2200 రూపాయల వరకూ వేరీ అవుతాయి. వీటన్నింటినీ నియంత్రించేది కేవలం ఓల్డెస్ట్ ఎకనామిక్ థియరీ డిమాండ్ అండ్ సప్లై.

* గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అనేది కొన్ని విపరీత పరిస్థితుల్లో బియ్యం గోధుమ లాంటివి ఉత్పత్తి ఎక్కువయిపోయి ధర చాలా పడిపోయినప్పుడు కానీ ఉత్పత్తి తక్కువయిపోయి ధర విపరీతంగా పెరిగిపోయినప్పుడు కానీ ఉంటుంది. అలాంటి విపరీత పరిస్థితి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ లో కానీ ప్రేక్షకుల లో కానీ ఎక్కడ వచ్చిందండీ?

* లూటీ అనే పదం ఉపయోగించేది బలాన్ని ఉపయోగించి క్రిమినల్ గా లాక్కున్నప్పుడు ...అమ్మేవాడు కొనేవాడు పరస్పరం అంగీకరించుకుని చేసుకునే దాన్ని ట్రాన్సాక్షన్ అంటారు ...ఆ ట్రాన్సాక్షన్ లీగల్ గా జరిగినప్పుడు గవర్నమెంట్ వాటా టాక్స్ రూపంగా తానంతట తనే వస్తుంది

* థియేటర్లనేవి ప్రజా కోణం లో వినోద సేవలందించే ప్రాంగణాలు అని చెప్పారు. అలా అని మీకు ఏ ప్రజలు చెప్పారో వాళ్ల పేర్లు చెప్పగలరా? లేకపోతే రాజ్యాంగం లో కానీ సినిమాటోగ్రఫీ యాక్ట్ లో కానీ ఈ డెఫినిషన్ ఉందా? మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని సమర్థించుకోవటానికి, ఆ డెఫినిషన్ మీకు మీరు ఇచ్చుకుంటున్నారు..

* థియేటర్లనేవి 1905 జూన్ 19 న నికెలోడియోన్ అనే ప్రపంచంలోనే మొట్ట మొదటి థియేటర్ అమెరికాలో పెట్టినప్పటి నుంచి ఈనాటి వరకూ అవి కేవలం బిజినెస్ కోసం పెట్టిన వ్యాపార సంస్థలు.. అంతే కానీ ప్రజా సేవ నిమిత్తం ఎప్పుడూ ఎవ్వరూ పెట్టలేదు..కావాలంటే మీ గవర్నమెంట్ లో ఉన్న థియేటర్ ఓనర్లని అడగండి.

* సొసైటీ ఆధునీకతకి ముఖ్య కారణం మోటివేషన్..ఎందుకంటే ప్రతి మనిషి కూడా మానవ సహజంగా తను ఉన్న పొజిషన్ కన్నా పైకి ఎదగాలని కోరుకుంటాడు .. పేదవాడు ధనికుడవ్వాలని కోరుకుంటాడు, సైంటిస్ట్ ఎవ్వరూ కనిపెట్టలేనిది కనిపెట్టాలనుకుంటాడు .మీ పార్టీ కార్యకర్త మీలా మంత్రి అవ్వాలని కోరుకుంటాడు .. మీ ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి అవ్వాలని కోరుకుంటాడు.

* అలా కోరుకునేది అందరి కన్నా బెటర్ అవ్వాలనే ఒక మోటివేషన్ తో..ఆ బెటర్ గా ఉన్నప్పుడు వచ్చే అదనపు సౌఖ్యాలని కట్ చేసినప్పుడు మనిషికి మోటివేషన్ పోతుంది.. కమ్యూనిజం ఘోరంగా ఫెయిల్ అయ్యింది అక్కడే.

* V EPIC థియేటర్ లో ఉన్న సౌకర్యాలను చూడకుండా ఆ థియేటర్ ఉన్న ఏరియా బట్టి టికెట్ ప్రైజ్ ఎలా పెట్టారు? వివిధ హోటల్సు లో ఆ ఆ హోటల్ వాళ్ళు వాళ్ళిచ్చే సౌకర్యాలను బట్టే ప్రైజ్ లిస్ట్ పెట్టుకుంటారు

* పవన్ కళ్యాణ్ సినిమాకి సంపూర్ణేష్ బాబు సినిమాకి మీ ప్రభుత్వంలో తేడా లేనప్పుడు మంత్రిగా మీకు, మీ డ్రైవర్ కి కూడా తేడా లేదా?

* పేదల కోసం చెయ్యడం అనే మీ ఉద్దేశం మంచిది కావచ్చు..కానీ దానికోసం పేదల్ని ధనికుల్ని చెయ్యటానికి మీ ప్రభుత్వం పని చెయ్యాలి కానీ ఉన్న దనికుల్ని పేదల్ని చెయ్యకూడదు..అలా చేస్తే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో కల్లా పేద రాష్ట్రం అయ్యే ప్రమాదముంది.

* నానీ గారు నేను ఒక యావరేజ్ ఇంజినీరింగ్ స్టూడెంట్ ని.. ఎకనామిక్స్ గురించి నాకు ఏ బీ సీ డీ కూడా తెలియదు.. కానీ మీరు అనుమతిస్తే మీ ప్రభుత్వం లో ఉన్న టాప్ ఎకనామిక్స్ ఎక్స్పర్ట్ తో నేను టీవీ డిబేట్ కి రెడీ..మా సినిమా ఇండస్ట్రీ కి మీ ప్రభుత్వానికి మధ్య ఏర్పడ్డ ఈ మిస్ అండర్స్టాన్డింగు తొలగిపోవడానికి ఇది చాలా అవసరం అని నా అభిప్రాయం.. థ్యాంక్యూ.

* చివరిగా పేర్ని నాని గారు మీ పార్టీ లో కొందరు మిగతా లీడర్ల లాగా అడ్డంగా తిట్లతోనో పర్సనల్ విషయాల మీద దూకడం కాకుండా డిగ్నిటీతో సామరస్యం పాటించినందుకు ఇంకోక్కసారి నా ధన్యవాదాలు. ఒక అంగీకారం అనేది లాజిక్ ఇచ్చిపుచ్చుకున్నప్పుడే వస్తుంది.




Tags:    

Similar News