బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్ ఇంట్లో కరోనా కలకలం రేపిన సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్ తోపాటు ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ కు కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని అమితాబ్ - అభిషేక్ సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ అభిమానులు అధైర్య పడొద్దని.. జాగ్రత్తగా ఉండమని పిలుపునిచ్చారు. అమితాబ్ - అభిషేక్ లు ఇద్దరు ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలియజేస్తున్నారు. అయితే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం అమితాబ్ కోసం కాదు.. కరోనా కోసం ప్రార్థనలు చేస్తున్నానంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు.
అమితాబ్ ట్వీట్ ని రీట్వీట్ చేసిన వర్మ ''సర్కార్.. కరోనాని తన్ని ఎప్పటిలాగే మీరు ఇంకా ఆరోగ్యంగా తిరిగి వస్తారని నాకు తెలుసు. అందుకే నేను మీ కోసం ప్రార్థనలు చేయను. కానీ మీపై దాడిలో ఖచ్చితంగా చనిపోయే కరోనా కోసం నేను ప్రార్థిస్తాను'' అని పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు కూడా ఇదే తరహాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా అభిషేక్ బచ్చన్ సతీమణి మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్ కి కూడా కరోనా సోకిందని నిర్ధారణ అయింది. ఐశ్వర్యారాయ్ తో పాటు కూతురు ఆరాధ్యకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. బచ్చన్ ఫ్యామిలీ మెంబర్స్ కరోనా బారిన పడటంతో ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ కి గురైంది. ఇక అమితాబ్ ఇంటి పరిసరాలను అధికారులు కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు.