డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు అంగీకరించిన రియా చక్రవర్తి

Update: 2020-09-06 16:00 GMT
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితురాలు రియా చక్రవర్తిని విచారణాధికారులు ఆదివారం విచారించారు. ఈ కేసును ఇటు సీబీఐ, అటు ఎన్సీబీ వేగవంతం చేశాయి. ఎన్సీబీ ఆధికారులు ఆమెకు సమన్లు జారీ చేయగా విచారణకు హాజరైంది. నేడు ఉదయం గం.10.30 సమయానికి ఎన్సీబీ కార్యాలయానికి వచ్చింది. ఆమెను 6 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఈ సందర్భంగా రియా డ్రగ్స్‌కు సంబంధించి ప్రశ్నల వర్షం కురిపించగా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయని తెలుస్తోంది.

తాను డ్రగ్స్‌ను కొనుగోలు చేసినట్లు రియా ఒప్పుకుందని తెలుస్తోంది. షోవిక్, మిరండాల ద్వారా డ్రగ్స్‌ను కొనుగోలు చేసినట్లు అంగీకరించింది. అలాగే, సుశాంత్ కోసం కూడా డ్రగ్స్‌ను కొనుగోలు చేశానని ఆమె అంగీకరించిందని తెలుస్తోంది. విచారణ సందర్భంగా అధికారులకు పూర్తిగా సహకరించలేదని తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. అలాగే, సోమవారం కూడా ఆమెను విచారించనున్నారు.

కాగా, సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుతో డ్రగ్స్ కేసు కూడా వెలుగు చూసింది. షోవిక్ చక్రవర్తి - దీపేష్ సావంత్ - శ్యామూల్ మిరండాలను అరెస్ట్ చేశారు. ఈ రోజు రియా కూడా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకు విచారణకు హాజరైన సమయంలో రియా లాయర్ సతీష్ మాన్‌ షిండే ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ కేసులో మంత్రగత్తెను వెంటాడినట్టు రియాను వెంటాడుతున్నారని - అయితే ఆమె అరెస్ట్‌ కు సిద్ధంగా ఉన్నారని - తను ప్రేమించిన వ్యక్తి కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్దమని - ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నారన్నారు.


Tags:    

Similar News