సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కేసులో రియా చక్రవర్తి మెడకు ఉచ్చు బిగుసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండు నెలల జైలు శిక్ష అనుభవించి ఇటీవలే బెయిల్ పై బయటికి వచ్చారు.ఇక ఈ కేసులో రియా బెయిల్ అసంబద్ధం అంటూ సుశాంత్ సింగ్ సోదరి ప్రియా సింగ్ సుప్రీంలో సవాల్ చేసారు. కానీ సుప్రీం రియాకు అనుకూలంగా తీర్పును వెలువరించడం సంచలనమైంది.
రియా చక్రవర్తికి పెద్ద ఉపశమనం కలిగించిన బాంబే హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి ప్రియాంక సింగ్ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు మెడికల్ ప్రిస్క్రిప్షన్ ను ఫోర్జరీ చేశారనే ఆరోపణలతో రియా చక్రవర్తి ఎఫ్.ఐ.ఆర్ ను రద్దు చేయాలని ప్రియాంక సింగ్ అభ్యర్థించారు. దీనిపైనా విచారణ సాగుతోంది.
ఒకసారి గతం చూస్తే.. డ్రగ్స్ నెక్సస్ కేసుకు సంబంధించిన కేసులో ఏడాది కాలంగా రియా చక్రవర్తి హెడ్ లైన్స్ లో నిలిచారు. ఈ కేసులో ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తిని కూడా .. రియాతో పాటు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
బార్ అండ్ బెంచ్ నివేదించిన ప్రకారం.. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కు డాక్టర్ అసంబద్ధంగా మెడిసిన్ తీసుకోవాలని సూచించలేదని న్యాయమూర్తులు చెప్పారు. ఈ ఆరోపణల్ని వినడానికి మొగ్గు చూపడం లేదని కోర్టు తెలిపింది. దివంగత నటుడికి నిషేధిత మందులు ఇవ్వడానికి తప్పుడు ప్రిస్క్రిప్షన్ పొందటానికి సోదరీమణులు డాక్టర్ తరుణ్ కుమార్ తో కుట్ర పన్నారని నటి రియా చక్రవర్తి తన ఫిర్యాదులో ఆరోపించారు. సుశాంత్ సింగ్ సోదరీమణుల కేసులో దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలో ఉన్నందున దర్యాప్తు సంస్థకు సమయం ఇవ్వాలని ఆమె అన్నారు. ప్రస్తుతం దీనిపై విచారణ సాగుతోంది.
7 సెప్టెంబర్ 2020 న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరీమణులపై రియా ఫిర్యాదు చేసింది. మాదకద్రవ్యాల సేకరణ ఆరోపణలపై రియా చక్రవర్తిని సెప్టెంబర్ 8 న ఎన్‌సిబి అరెస్టు చేసింది. ఏజెన్సీ అరెస్టు చేసిన ఇతరులలో ఆమె సోదరుడు షోయిక్ - సుశాంత్ మాజీ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరాండా - దీపేశ్ సావంత్ ఉన్నారు. రియా చక్రవర్తికి అక్టోబర్ 7 న బొంబాయి హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా ఆమె సోదరుడికి బెయిల్ ని కోర్టు నిరాకరించింది.