సుశాంత్ మరణం తర్వాత తనపై వస్తున్న ఆరోపణల గురించి స్పందించేందుకు ఒక జాతీయ మీడియా సంస్థకు రియా చక్రవర్తి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలను వెళ్లడి చేసింది. సుశాంత్ ఉన్న సమస్యల నుండి మొదలుకుని ఆయన గంజాయి తాగుతాడు అనే వరకు అన్ని విషయాల గురించి పేర్కొంది. జూన్ 8వ తారీకున ఏం జరిగింది.. అసలు ఆ రోజున ఎందుకు సుశాంత్ ఇంటి నుండి రియా వెళ్లి పోయింది అనే విషయమై రియా స్పందించింది. సుశాంత్ బలవంతంగా తనను ఇంటి నుండి పంపించాడంటూ రియా ఆరోపించింది.
చనిపోయిన వ్యక్తి గురించి ఇలా మాట్లాడాల్సి రావడం ఇబ్బందిగా ఉన్నా తప్పడం లేదంటూ... సుశాంత్ తో యూరప్ ట్రిప్ అయిన తర్వాత నేను ఆయనతోనే ఉంటున్నాను. ఆయన ఇంట్లో ఉన్న సమయంలోనే అనారోగ్యం పాలయ్యాను. అక్కడే ట్రీట్‌మెంట్ కూడా తీసుకుంటున్నాను. ఆ సమయంలో సుశాంత్ తన సోదరి వస్తుంది ఇంటి నుండి వెళ్లమంటూ ఒత్తిడి చేశాడు. రెండు మూడు రోజులు ఆ విషయంలో మా మద్య చర్చ జరిగింది.
జూన్ 8వ తారీకున మరో రెండు గంటలకు సుశాంత్ సోదరి వస్తుందని బలవంతంగా నన్ను పంపించాడు. అనారోగ్యంతో ఉన్న నేను అక్కడ నుండి ఇంటికి వచ్చాను. ఆ రోజు అంతా కూడా నాకు ఫోన్ చేయలేదు. తర్వాత రోజు మెసేజ్ చేశాడు. నా ఆరోగ్యం బాగా లేదని తెలిసి కూడా కాల్ చేయలేదు అంటే అతడికి నేను అవసరం లేదు అనిపించింది. అందుకే నేను అతడి నెంబర్ బ్లాక్ చేశాను అంటూ రియా అసలు విషయాన్ని చెప్పింది. రియా నెంబర్ బ్లాక్ చేయడంతో మరింత డిప్రెషన్ కు వెళ్లి సుశాంత్ చనిపోయి ఉంటాడేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.