సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కేసులో రియా చక్రవర్తిపై సీబీఐ విచారణ సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో రకరకాల అంశాలు రియాను ఆమె కుటుంబీకుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే తనని తాను డిపెండ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.
అయితే ఈ కేసు విచారణ పూర్తిగా తేలకముందే రియాను దోషి అన్నట్టుగా మీడియా చానెళ్లు కథనాలు వెలువరించడంపై ఆమె కుటుంబీకులు మండిపడుతున్నారు. రియా అయితే మీడియా కనిపిస్తే నమిలేయాలన్నంత కోపంగా చూస్తోంది.
నేటి ఉదయం నుంచి రియాపై సీబీఐ విచారణ సాగుతోంది. రియా చక్రవర్తిని ముంబైలోని ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో సిబిఐ విచారిస్తున్నట్లు ఉదయమే వెల్లడించాం. ఇప్పటికి విచారణ ముగిసింది. రియా ఇంటికి తిరిగి వచ్చింది.
అయితే రియా గెస్ట్ హౌస్ నుండి బయటికి రాగానే మీడియా ఆల్మోస్ట్ మీద పడినంత పని చేసింది. దానికి కలత చెందిన రియా విలేకరులపై అరుస్తూ కారు విండోపై పడడం మీడియాలో హైలైట్ గా ప్రసారమైంది. ఆమె ఆస్తులు.. బ్యాంక్ స్టేట్ మెంట్ లు.. మాదకద్రవ్యాల డీలర్లతో ఉన్న సంబంధాలపై నేడు రియాను సీబీఐ విచారించింది. రకరకాల ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది.