ఈత కొల‌నులో స్టార్ డాట‌ర్ చిద్విలాసం

Update: 2021-09-06 16:30 GMT
స్టార్ డాట‌ర్స్ ఈత కొల‌ను విన్యాసాలు అభిమానుల్లో నిరంత‌రం ఆస‌క్తిని పెంచేవే. జాన్వీ క‌పూర్.. సారా అలీఖాన్.. అన‌న్య పాండే లాంటి న‌ట‌వార‌సురాళ్లు ఇప్ప‌టికే ఈ త‌ర‌హా ట్రీట్ తో యూత్ కి మ‌త్తెక్కించారు. ఇప్పుడు పెళ్ల‌యిన యువ‌తి.. క‌పూర్ డాట‌ర్ రియా క‌పూర్ ఈత కొల‌ను విన్యాసం యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవ‌లే బిజినెస్ మేన్ కం నిర్మాత‌ను పెళ్లాడిన ఈ యంగ్ బ్యూటీ ప్ర‌స్తుతం మాల్దీవుల్లో విహ‌రిస్తోంది. భ‌ర్త‌తో క‌లిసి ఒంటరి దీవిలో చిద్విలాసంగా గ‌డిపేస్తోంది. ఇక ఈత కొల‌నులో ఇలా శ‌వాస‌నంలో తేలియాడుతూ రియా క‌పూర్ విన్యాసాలు క‌ళ్లు తిప్పుకోనివ్వ‌డం లేదు మ‌రి.

నవ వధువు అరుదైన క్ష‌ణాల్ని ఒంట‌రి దీవిలో ఆస్వాధిస్తోంది. త‌న‌ స్టైలిస్ట్ సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో ఒక రేర్ క్లిక్ ని షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. లేడీ నిర్మాతగా రియాక‌పూర్ సుప్ర‌సిద్ధురాలు. ఆమె మాల్దీవుల ద్వీప దేశంలోకి ప్రవేశించాక సంబ‌రాలు మొద‌ల‌య్యాయి. బహుశా ఆమె హనీమూన్ కోసం ఈ ట్రిప్ వెళ్లార‌ని భావిస్తున్నారు. రియా స్విమ్మింగ్ పూల్ లో కూల్ గా చిల్ అవుతున్న ఫోటో ఇది. దానితో ROFL శీర్షికను జోడించింది. ``పిల్లలను నాని ఇంట్లో వదిలేయండి`` అని ఆమె తన పోస్ట్ కి క్యాప్షన్ ఇచ్చింది. రియా త‌న‌ భర్త కరణ్ బూలానీ పెంపుడు కుక్కలను ఉద్దేశించి ఇలా వ్యాఖ్యానించింద‌ట‌. ఆదివారం ముంబై విమానాశ్రయంలో రియా కపూర్ - కరణ్ బూలానీ కెమెరా కంటికి చిక్కారు. అనంత‌రం మాల్దీవుల విహారం నుంచి ఫోటోల‌ను రియా స్టైలిష్ట్ షేర్ చేస్తోంది.

సినీ నిర్మాత రియా కపూర్ చిరకాల ప్రియుడు కరణ్ బూలానీని గత నెలలో ముంబైలో బంధుమిత్రులు స‌న్నిహితుల స‌మ‌క్షంలో వివాహం చేసుకున్నారు. జుహూలోని ఆమె తండ్రి అనిల్ కపూర్ బంగ్లాలో జరిగిన ఈ వివాహానికి కుటుంబ సభ్యులు కొద్దిమంది సన్నిహితులు హాజరయ్యారు.

రియా కపూర్ బాలీవుడ్ ప్రముఖుడు అనిల్ కపూర్ .. నగల డిజైనర్ సునీతా కపూర్ ల‌ కుమార్తె.  సోనమ్ కపూర్ - హర్షవర్ధన్ కపూర్ రియా తోబుట్టువులు. సినిమా నిర్మాతగానే కాకుండా ఆమె స్టైలిస్ట్ (ఎక్కువగా ఆమె సోదరి సోనమ్ కపూర్ కోసం) గా సుప‌రిచితం. ఐషా- ఖూబ్ సూరత్ - వీరే డి వెడ్డింగ్ వంటి మూడు చిత్రాలకు స‌హ‌నిర్మాత‌గా రియా కొన‌సాగింది. ఈ మూడింటిలో సోనమ్ కపూర్ నటించింది. రియా-సోన‌మ్ ద్వయం 2017 లో ప్రారంభించిన `రీసన్` అనే దుస్తుల బ్రాండ్ పెద్ద స‌క్సెసైంది.

2010 లో సోనమ్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన `ఐషా` కు కరణ్ బూలానీ సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఫామ్-జామ్‌లు కుటుంబ కార్యక్రమాలతో సహా అనేక సందర్భాల్లో అతను కపూర్ లతో గ్రూప్ ఫోటో లో క‌నిపించాడు. ఆ క్ర‌మంలోనే రియాతో స్నేహం ప్రేమ‌గా మారింది. అనంత‌రం కొన్నేళ్ల‌కు పెళ్లితో ఒక‌ట‌య్యారు.
Tags:    

Similar News