పెళ్లి అనేది స్వర్గంలో నిర్ణయిస్తాడు దేవుడు. అందుకే కొన్ని పెళ్లిల్లు సడెన్ గా జరిగి పోతుంటాయి. కనీస కబురు అయినా లేకుండానే ఇదిగో నా పెళ్లి జరిగిపోయింది! అంటూ సెడెన్ గా షాకిచ్చింది లీడర్ బ్యూటీ రిచా గంగోపాధ్యాయ్. రిచా తన కాలేజ్ బోయ్ ఫ్రెండ్ జో లాంగెళ్లాను పెళ్లాడి సడెన్ ట్విస్టిచ్చింది.
ప్రస్తుతం రిచా- జో జంట ఫోటోలు అంతర్జాలం లో వైరల్ గా మారాయి. రిచా నిశ్చితార్థం జనవరి లో జరిగినా ఇక్కడ అభిమానులకు దాని గురించి తెలిసింది తక్కువే. అయితే దానికి కారణం లేకపోలేదు. రిచా అమెరికాలో చదువుకుంది. అక్కడే మిస్ ఇండియా యు.ఎస్.ఏ టైటిల్ ని గెలుచుకుంది. అటుపై శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన `లీడర్` చిత్రం ఆడిషన్స్ లో పాల్గొని ఎంపికైంది. ఆ సినిమా తోనే రానా కథానాయకుడి గా పరిచయం అయిన సంగతి తెలిసిందే. యంగ్ సీఎం రానా ప్రేమించే అందాల యువతిగా రిచా నటన యువతరానికి నచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ లో కెరీర్ కోసం రిచా చాలానే శ్రమించింది. మిరపకాయ్- మిర్చి లాంటి బ్లాక్ బస్టర్లలోనూ నటించింది. కానీ ఆ తరువాత ఎందుకనో అదృష్టం తనకు ఎంతమాత్రం కలిసి రాలేదు. ఇక్కడ ఆశించిన స్టార్ డమ్ ని అందుకోవడంలో విఫలమైంది. ఆ క్రమంలోనే సినిమాలకు భాయ్ చెప్పి తిరిగి అమెరికా వెళ్లిపోయింది.
ఉన్నట్టుండి సడెన్ గా 2019 జనవరిలో బోయ్ ఫ్రెండ్ జోతో నిశ్చితార్థం చేసుకుంది. అటుపై పెళ్లికి ఏర్పాట్లు సాగాయి. తాజాగా రిచా- జో లాంగిళ్లా జంట పెళ్లి హిందూ- క్రిస్టియన్ సాంప్రదాయాల్లో జరిగింది. రిచా తాను చదువుకున్న బిజినెస్ స్కూల్ లో స్నేహితుడినే ఇప్పుడు పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైంది. పెళ్లి తర్వాత నటనలోకి రీఎంట్రీ ఇస్తుందా లేదా? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.