ఒక ప్రాంతం, భాష, సంప్రదాయాలపై ప్రేమ వుండొచ్చు. దాన్ని ప్రదర్శించే తీరు ఇతరులకు ఇబ్బందికలిగించనంత వరకే బాగుంటుంది. అదే అతి చేస్తూ ఇబ్బందికరంగా స్పందించడం మొదలు పెడితే అది అనవసర అనర్థాలకు దారి తీస్తుంది.
'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి తీరు కూడా ఇప్పడు ఇలాగే వుంది. వివరాల్లోకి వెళితే.. కన్నడ హీరో, దర్శకుడు రిషబ్‌శెట్టి తెరకెక్కించి నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'కాంతార'. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ కన్నడలో సంచలన విజయాన్ని సాధించింది.
ఏకంగా కన్నడలో రూ. 100 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురిచేసింది. 'కేజీఎఫ్' మేకర్స్ హోంబలే ఫిలింస్ బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదలై సంచలనాలు సృష్టిస్తోంది. తెలుగు వెర్షన్ ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా దాదాపు రూ. 40 కోట్ల మేర వసూళ్లని రాబట్టి షాకిచ్చింది.
హిందీ వెర్షన్ కూడా రికార్డు స్థాయిలో వసూళ్లని రాబడుతూ అక్కడి ఫిల్మ్ స్టార్స్ ని కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతూ కాసుల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ సినిమా విజయం సాధించిన నేపథ్యంలో హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవి ఇప్పుడు పెను వివాదంగా మారుతున్నాయి. ఉత్తరాది ప్రేక్షకులు రిషబ్ శెట్టి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.
ఇటీవల ఓ మీడియాతో మాట్లాడిన రిషబ్ శెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కన్నడ వ్యక్తిగా గర్వపడుతున్నా. హిందీ సినిమాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ నటించను. కారణం కన్నడ ఇండస్ట్రీ , కన్నడ ప్రజల వల్లే నేను ఇప్పడు ఈ స్టేజ్ లో వున్నాను.
ఒక్క సినిమా హిట్టయినంత మాత్రాన నా కుటుంబం, నా ఫ్రెండ్స్ మారరు. కన్నడ సినిమాలంటేనే నాకు ఇష్టం. అంటూ రిషబ్ శెట్టి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. కన్నడ ప్రేక్షకులు రిషబ్ వ్యాఖ్యలని సమర్థిస్తుంటే హిందీ ప్రేక్షకులు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. అలాంటప్పుడు సినిమాని హిందీలో ఎందుకు రిలీజ్ చేశాడని మండిపడుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.