హిట్ ఇచ్చి వెంటనే ఫట్ ఇచ్చారు

Update: 2017-09-21 11:38 GMT
ప్రస్తుత రోజుల్లో సినీ సెలబ్రెటీల మధ్య వివాదాలు తార స్థాయికి చేరుతున్నాయి. ఎ ఫిల్మ్ ఇండస్ట్రీలో చూసినా ఎదో ఒక గొడవ హల్ చల్ చేస్తూనే.. ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే రోజుకో వివాదం చెలరేగుతోంది. సినిమా హిట్ అయితే కలిసి మెలిసి తిరిగే తారలు అదే సినిమా అపజయాన్ని అందుకుంటే కారాలు మిరియాలు నూరుతున్నారు. రీసెంట్ గా ఇదే తరహాలో బాలీవుడ్ లెజెండ‌రీ హీరో రాజ్ క‌పూర్ త‌న‌యుడు హీరో రిషి కపూర్ కూడా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి అందరిని షాక్ కి గురి చేశాడు.

తన కొడుకు రణ్‌బీర్‌ కపూర్‌ తో  భారీ బడ్జెట్ సినిమాలు తీసి అనురాగ్‌ కశ్యప్‌, అనురాగ్‌ బసు దర్శకులు నిండా ముంచేశారని చెప్పారు. గతంలో సోషల్ మీడియా ద్వారా కూడా ఈ స్టార్ ఇలానే కామెంట్ చేశాడు. అయితే ఈ సారి ఏకంగా టాక్ షోలోనే కోపంతో ఊగిపోయారు. నేహా ధూఫియా టాక్‌షో 'నో ఫిల్టర్‌ నేహా' లో రిషి ఈ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. అనురాగ్ గురించి ఒక్క నిమిషం మాట్లాడాలని నేహా అడుగగా.. రిషి ఈ విధంగా స్పందించాడు.

అనురాగ్‌ కశ్యప్‌ మొదట 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ వస్సీపూర్‌' మంచి సినిమా తీశాడు. కాని ఆ తర్వాత 'బొంబే వెల్వెట్‌' అనే భారీ బడ్జెట్ సినిమా తీసి భారీ డిజాస్టర్ ని ఇచ్చాడు. అదే తరహాలో మొదట అనురాగ్ బసు 'బర్ఫీ' అనే సినిమాను తీసి తన కొడుకుకి మంచి గుర్తింపు తెచ్చాడు. ఆ సినిమా మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. కానీ ఆ తర్వాత ఆలోచించకుండా అతి నమ్మకంతో 'గజ్జా జాసూసో'.. 'జగ్గాజాసూసో' తీసి రణ్‌బీర్‌ స్టార్ ఇమేజ్ ని చెడగొట్టాడు. ఏ మాత్రం ఆలోచించకుండా ఈ ఇద్దరు భారీ బడ్జెట్ సినిమాలతో రణ్‌బీర్‌ ని పాడు చేశారని రిషి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ బాలీవుడ్ లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
Tags:    

Similar News