తన కొడుకుకి ఫ్లాప్ సినిమాలిచ్చిన దర్శకులపై హీరో తండ్రి భగ్గుమన్నాడు. మనసులో ఏమీ దాచుకోకుండా తన అసంతృప్తినంతా వెళ్లగక్కాడు. ఆ దర్శకులు అలాంటి చెత్త సినిమాల్ని ఎలా తీశారో కూడా అర్థం కాలేదని వాపోయాడు. ఆ హీరో తండ్రి ఎవరో కాదు... రిషి కపూర్. ఈయన కొడుకే బాలీవుడ్ యంగ్ హీరో రణ్ బీర్ కపూర్. కెరీర్ ఆరంభంలోనే అదరగొట్టే సినిమాలు చేశాడు రణ్ బీర్. మంచి నటుడిగా కూడా గుర్తింపు తెచ్చుకొన్నాడు. బాలీవుడ్ స్టార్లలో ఒకానొక టాప్ పొజిషన్ దక్కించుకొన్న రణ్‌బీర్‌కి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకొన్నాడు. అయితే `సంజు`కి ముందు ఆయన కెరీర్ ఒడుదుడుకులకు లోనైంది. చాలా సినిమాలు డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. దాంతో రణ్ బీర్ కపూర్ క్రేజ్ క్రమంగా తగ్గుతూ వచ్చింది. అయితే ఈ దశలో మళ్లీ రాజ్ కుమార్ హిరాణీ వల్ల `సంజు` చేశాడు రణ్ బీర్. ఆ చిత్రం 300 కోట్లు వసూళ్లు సాధించి సంచలన విజయాన్ని నమోదు చేసింది. రణ్ బీర్ మళ్లీ సూపర్ ఫామ్ ని అందుకొన్నాడు. ఇక ఇదే దూకుడు కొనసాగించాలనే ప్రయత్నంలో ఉన్నాడాయన. అయితే సంజు తెరకెక్కడంలో రణ్ బీర్ తండ్రి రిషి కపూర్ పాత్ర చాలా ఉందట. ఆయనే రాజ్ కుమార్ హిరాణీతో మాట్లాడి రణ్ బీర్ కథానాయకుడిగా `సంజు`ని పట్టాలెక్కించాడని ప్రచారం సాగుతోంది.
ఇటీవలే రిషి కపూర్ ఓ ఇంటర్వ్యూలో తన కొడుకు కెరీర్ గురించి మాట్లాడుతూ ``సంజు కోసం మా అబ్బాయి పడిన కష్టం అంతా ఇంతా కాదు. రోజూ ఇంటికొచ్చి అన్నం కూడా తినకుండా జిమ్ చేసేవాడు, కొన్నాళ్లు బరువు పెరిగి, ఆ తర్వాత మళ్లీ తగ్గించుకొన్నాడు. తన కష్టాన్ని ఇంకా చాలా మంది నోటీస్ చేయలేద``ని తన మనసులో మాటని వెలిబుచ్చాడు. అలాగే తన కొడుకుతో అంతకుముందు సినిమాలు చేసిన అనురాగ్ బసు - అనురాగ్ కశ్యప్ లపై కూడా మండిపడ్డారు. వీరిలో ఒకరు రణ్ బీర్ తో జగ్గా జసూస్ చేస్తే - మరొకరు బాంబే వెల్వెట్ చేశారు. ఈ రెండూ కూడా ఫ్లాప్ సినిమాలే. అనురాగ్ కశ్యప్ కి సినిమా తీయమని మీరు డబ్బు ఇచ్చి చూడండి, దాంతో ఆయనకి ఏం చేయాలో కూడా అర్థం కాదని, అలాగే అనురాగ్ బసు జగ్గా జాసూస్ లాంటి చెత్త సినిమాని ఎలా తీశాడో నాకు ఇప్పటికీ అర్థం కాదని అన్నాడు రిషి కపూర్. ఆ విషయమే రణ్ బీర్ ని అడిగితే ``నాకు బర్ఫీలాంటి మంచి సినిమానిచ్చిన దర్శకుడిని నేను కథ గురించి కొత్తగా ఏం అడుగుతాను నాన్నా అన్నాడ``ని చెప్పుకొచ్చాడు రిషికపూర్. మొత్తంగా తన కొడుకు కెరీర్ గాడిలో పడటంతో రిషికపూర్ ఆనందంగా ఉన్నాడు.