బాలీవుడ్ లో ప్రేమలు - పెళ్లిళ్లు ఎంత స్పీడ్ గా సెట్ అవుతాయో, అంతే స్పీడ్ గా సెపరేట్ అవుతుంటాయి. అసలు పెళ్లి వరకూ వచ్చేవే తక్కువ అయితే, ఆ తర్వాత కూడా విడిపోయే వాళ్లు బోలెడు మంది ఉంటారు. పెళ్లి చేసుకుని చక్కగా కాపురం చేసుకునే వాళ్ల సంఖ్య తక్కువగానే ఉంటుంది. అలాంటి అరుదైన జంటల్లో రితేష్ దేశ్ ముఖ్ - జెనీలియా కూడా ఉంది. ఏళ్లపాటు ప్రేమించుకుని, ఆ తర్వాత పెళ్లి చేసుకుని, ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారు.
ఇప్పుడు వాళ్లకి మ్యారేజ్ జరిగి 4 ఏళ్లు పూర్తయింది. ఈ సమయంలో వారికో సంతానం కూడా. ఇప్పుడు మరోసారి జెన్నీ గర్భంతో ఉంది. ఓ ముఖ్యమంత్రి కొడుకు అయ్యుండి, హీరోయిన్ తో నడిపిన వ్యవహారాన్ని పెళ్లి వరకూ తీసుకురావడమే కాదు.. ఆ తర్వాత కూడా కాపురాన్ని ఇంత హాయిగా, అన్యోన్యంగా కంటిన్యూ చేస్తున్నాడంటే.. రితీష్ వెరీ గ్రేట్ అంటారు చాలా మంది. ఇదే పెద్ద రికార్డ్ అనుకుంటే.. అంతకంటే గొప్పగా ఓ ట్వీట్ చేశాడు రితేష్ దేశ్ ముఖ్. తన భార్యను తాను ఎంతగా ప్రేమిస్తాడో చెప్పకనే చెప్పిన ఆ ట్వీట్ చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది.
'నేను జీవితంలో చేసిన అతి గొప్ప పని నా భార్య చేయి అందుకోవడమే'-ఇదీ రితీష్ చేసిన ట్వీట్. జెన్నీతో వైవాహిక జీవితం అద్భుతంగా ఉందని, అమెనే పెళ్లి చేసుకోవాలన్న తన నిర్ణయం అత్యుత్తమమైందని ట్విట్టర్ సాక్షిగా ప్రపంచానికి చెప్పాడు ఈ హీరో. ఏమైనా తనను పెళ్లి చేసుకోవడమే జీవితంలో బెస్ట్ అని ఓ భర్త అంటే.. ఆ భార్యకి అంతకంటే సంతోషం ఇచ్చే విషయం మరొకటి ఉండదు కదా. అందుకే హ్యాపీ హ్యాపీ అని పాట పాడేసుకుంటోంది జెన్నీఇప్పుడు.