బాలీవుడ్ లో జెనీలియా- రితేష్ దేశ్ ముఖ్ జంట ఆదర్శ జంటగా వెలిగిపోతున్న సంగతి తెలిసిందే. తొలుత ఆదర్శ ప్రేమికులుగా ప్రపంచానికి ఆవిష్కృతమైన ఈ జోడీ సంసార జీవనంలోనూ ప్రేమ జంటలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇక కెరీర్ పరంగా ఎవరికి వారు ఎవరి దారిలో వారు వెళుతున్నారు. ఓవైపు జెనీలియా పిల్లల్ని చూసుకుంటూ కుటుంబాన్ని చక్కదిద్దుతూనే ఇటు రితేష్ గౌరవం పెంచే విధంగా నడుచుకుంటోంది. రితేష్ బాలీవుడ్ లో అడపాదడపా నటిస్తూనే స్వభాషలోనూ నటించే ప్రయత్నం చేస్తున్నాడు.
అదంతా సరే కానీ.. తాజాగా రితేష్ తీవ్రంగా హర్టయ్యాడట. `జెనీలియా భర్త` అని పిలిచిన తరువాత రితీష్ దేశ్ ముఖ్ అహం దెబ్బతిందట. అవతలివాళ్లు దానిని ఎత్తి చూపినప్పుడు మరిగిపోయేవాడినని చెప్పుకొచ్చాడు ఎలాంటి భేషజం లేకుండా ఆ షోలో రితేష్. కపిల్ శర్మ షోలో రితేష్ - జెనీలియా జోడీ పాల్గొనగా.. ఓ ప్రశ్నకు సమాధానంగా రితీష్ దేశ్ ముఖ్ పాత సంగతిని చెప్పుకొచ్చాడు. భారతదేశంలోని దక్షిణ రాష్ట్రాల్లో ‘జెనెలియా భర్త’ అని తనని పిలిచేవారని చెప్పుకొచ్చాడు. దానివల్ల తాను తీవ్రంగా హర్టయ్యేవాడినని అన్నాడు.
అదంతా సరే కానీ.. భార్య జెనెలియాకు దక్షిణాదిలో ఉన్న ప్రజాదరణను కూడా ఆ క్షణం అతడు గుర్తు చేసుకుని తన పెద్దరికం నిలబెట్టుకున్నాడు. ఈ షోలో ఆదర్శ జంట ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది? అంటే.. రాబోయే వారాంతపు ఎపిసోడ్ టెలీకాస్ట్ అవుతుందట. దాని నుండి ఒక ప్రోమోలో రితేష్ ‘జెనెలియా భర్త’ అని పిలవబడే తన అనుభవాన్ని పంచుకున్నాడు.
రితేష్ మాట్లాడుతూ, .. “మేము బెంగళూరులో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఆడుతున్నాము. ఒక దక్షిణాది జట్టు ఆటలో ఉంది. దాని నుండి ఇద్దరు ఆటగాళ్ళు ‘జెనెలియా భర్త’ అని గుసగుసలాడుకుంటున్నారు. నా అహం దెబ్బతింది. నేను వారితో ఏమన్నానంటే.. ‘నేను ఇక్కడ జెనెలియా భర్త.. మహారాష్ట్రలో ఈమె రితీష్ భార్య’ అన్నాను. ‘సర్...., రితీష్ భార్య ఒక రాష్ట్రంలోనే కానీ కేరళ- కర్ణాటక- ఆంధ్రప్రదేశ్- తమిళనాడులో జెనెలియా భర్త ...’ అని ఆరోజు వాళ్లు నాతో అన్న విషయం ఇంకా గుర్తింది! అని కపిల్ శర్మ షోలో చెప్పుకొచ్చాడు.
రితీష్ - జెనెలియా వివాహం చేసుకుని ఎనిమిది సంవత్సరాలు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రియాన్ ( 5).., రాహిల్ ( 4). ఇద్దరూ 2003 చిత్రం తుజే మేరీ కసం చిత్రంతో బాలీవుడ్ లోకి ప్రవేశించారు. బాలీవుడ్ చిత్రాలైన మస్తీ,... క్యా కూల్ హమ్ ... బ్లఫ్ మాస్టర్! చిత్రాల్లో ఈ జోడీ జంటగా నటించారు. సత్యం.. బొమ్మరిల్లు -హ్యాపీ - రెడీ చిత్రాలతో జెనీలియా టాలీవుడ్ లో ఫేమస్ అయ్యారు. జెనీలియా చాలా సంవత్సరాల తరువాత బాలీవుడ్ కి తిరిగి వచ్చింది. 2008 చిత్రం మేరే బాప్ పెహ్లే ఆప్ లో కనిపించింది. తరువాత జానే తు యా జానే నా చిత్రంలో కనిపించింది.
Full View Full View Full View