వినాయక చవితి వచ్చేస్తోంది. హైద్రాబాద్ అంతా ఇప్పటికే గణేష్ విగ్రహాలతో నిండిపోతోంది. మన దగ్గర గణేష్ చతుర్ధిని లో ఎండ్ నుంచి హైఎండ్ వరకూ అన్ని రకాలుగా జరుపుకుంటాం. నిజం మాట్లాడుకుంటే.. హైద్రాబాద్ కంటే ముంబైలో గణేష్ హంగామా పీక్స్ లో ఉంటుంది. ఒక వినాయక చవితి ముగియగానే.. నెక్ట్స్ పండక్కి ఏర్పాట్లు మొదలైపోతాయంటే.. ముంబైలో గణేష్ ఎంత ఇంపార్టెంట్ అనే విషయం అర్ధమవుతుంది. అయితే.. ప్రతీ ఏటా 'గణపతి బప్పా మోరియా' పాటను ప్లే చేసుకోవడం.. డిఫరెంట్ ట్యూన్స్ తో కంపోజ్ చేయడం.. ప్లే చేయడం చూస్తూనే ఉన్నాం.
కానీ ఈ సారి మాత్రం జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్ తో.. మరాఠీ ఛానల్ ప్రవాహ్ ఓ కొత్త ఆంథమ్ రూపొందించింది. థాంక్ గాడ్ బప్పా అంటూ సాగే ఈ పాట ప్రతీ లైన్ ఆకట్టుకుంటుంది. మొత్తం సాంగ్ లో గణేష్ మేకప్ వేసుకున్న పిల్లలతో పాటు.. రకరకాల గెటప్స్ లో రితేష్ కనిపిస్తాడంతే. కానీ అన్ని కేరక్టర్లలోనూ వేరియేషన్ చూపిస్తూ.. ఆ చిన్న పాటలో చాలానే కౌంటర్లు వేశారు. ఇంకా చెప్పాలంటే గణేష్ పేరుతో చేస్తున్న అడ్డమైన పనులను తెగుడుతూ.. జనాలకు మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఇది మరాఠీ సాంగ్ అయ్యే సరికి.. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఉంటుంది. చందాలు వసూలు చేయడం నుంచి.. పోలీసుల హంగామా వరకు.. జనాల కోరికల చిట్టాల నుంచి ఎక్కడపడితే అక్కడ విగ్రహాలు పెట్టడం వరకూ.. ఏ యాంగిల్ లోనే వదలకుండా కౌంటర్లతో పాటు మెసేజ్ కూడా ఇచ్చారు. ఇన్ని చేస్తున్నా గణేష్ మాత్రం అందరినీ ఒకేలా చూస్తాడంటూ 'థ్యాంగ్ గాడ్ బప్పా' అని చెప్పడమే ఈ ఆంథమ్ అసలు పాయింట్. మస్ట్ వాచ్ అంతే. ఓసారి మీరూ చూడండి.
Full View