ఒక హీరోయిన్ ఒకే సినిమాతో.. మూడు భాషల్లో అరంగేట్రం చేయడం అసాధారణం అనాలి. ఇలాంటి రేర్ ఫీట్ రితికా సింగ్ కి మాత్రమే సాధ్యమైంది. ద్విభాషా చిత్రంగా రూపొందిన ఓ చిత్రంతో రెండు భాషల్లో అడుగు పెట్టింది. సాలాఖడూస్ తో హిందీలోను.. ఇరుదు సూత్రు చిత్రంతో తమిళంలోను ప్రవేశించింది రితికా సింగ్. మాధవన్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం రెండు భాషల్లోనూ మంచి హిట్ సాధించింది.
దర్శకురాలు సుధ కొంగరకు అన్ని వర్గాలను ప్రశంసలు దక్కాయి. ఇప్పుడీ సినిమాని తెలుగులో రీమేక్ చేసేందుకు రంగం సిద్ధమైంది. వెంకటేష్ ప్రధాన పాత్రలో తెలుగులో ఈ సాలాఖడూస్ నిర్మితం కానుంది. టాలీవుడ్ లో ఈ మూవీని పీవీపీ సినిమాస్ నిర్మించనుండగా.. ఒరజినల్ ను డైరెక్ట్ చేసిన సుధ కొంగర నే దర్శకత్వం వహించనున్నారు. మాతృకలో తాను పోషించిన పాత్రను తెలుగులో కూడా అదే అమ్మాయితో చేయించాలని దర్శకనిర్మాతలు నిర్ణయించడం విశేషం.
అలా మూడో భాషలో కూడా అదే మూవీతో అరంగేట్రం చేస్తోంది రితికా సింగ్. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా దాదాపు పూర్తయిపోగా.. సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు గాను ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో బాబు బంగారంను తుది దశకు చేర్చిన వెంకటేష్.. అది పూర్తి కాగానే ఈ సాలాఖడూస్ రీమేక్ ను మొదలుపెట్టనున్నాడు.