హాలీవుడ్లో 2.0 వేడి బెలూన్ ఎగిరింది

Update: 2017-06-28 04:43 GMT
రజినీకాంత్ అండ్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన శివాజి, రోబో సినిమా తరువాత వస్తున్న మరో భారీ బడ్జెట్ మూవీ ''2.0''. ఈ సినిమా రోబో సినిమాకు సీక్వెల్ గా నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ పనులలో తలమునకలై ఉన్నారు టీమ్. ఇప్పటికే లైకా ప్రొడక్షన్స్ వారు ప్రపంచ ప్రచార ప్రణాళిక విడుదల చేయగా.. ​ఇప్పుడు ​వేడి బెలూన్ తయారుచేసి 2.0 మార్కెటింగ్ లో కొత్తపుంతలు తొక్కుతుంది.

రజినీకాంత్ హీరో గా నటిస్తున్న ఈ సినిమా కోసం లైకా ప్రొడక్షన్ వాళ్ళు హాలీవుడ్లో 100  అడుగుల వేడి బెలూన్ ను సినిమా ప్రమోషన్ కోసం తయారుచేశారు. దీన్ని టెస్ట్ చేసి ఇలాంటి బెలూన్లనే శాన్ఫ్రాన్సిస్కో  - లండన్ - దుబాయ్ - ఆస్ట్రేలియా - లాస్ ఏంజలీస్ లలో కూడా ప్రచారానికి వాడతారు అని తెలుస్తోంది. ఈ వేడి బెలూన్ పై హీరో రజినీకాంత్ విలన్ అక్షయ్ కుమార్ గ్రాఫిక్ చిత్రాలను వేసి సిటీ మొత్తం ప్రమోషన్ చేయడానికి సిద్దం చేస్తున్నారు. ఇది విజయవంతం అయితే ఇలానే ప్రపంచ నగరాలలో చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ ఫోటోలను చూడండి.. టెస్ట్ డ్రైవ్ లో భాగంగా బెలూన్లను చూపెట్టారు. నిజంగానే వావ్ అనే రేంజులో ఉన్నాయి కదూ.

సుమారుగా 400 కోట్లు బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 25 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ప్రతి నాయకుడుగా చేస్తున్నాడు. అమీ జాక్సన్ రజినికి జోడీగా నటిస్తుంది. ఈ సినిమాకు సంగీతం ఏ.ఆర్.రహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అక్టోబర్ నెలలో ఆడియో విడుదల చేస్తారని తెలుస్తుంది.​

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News