రోబో-2 దెబ్బకు భయపడ్డాడు

Update: 2016-12-02 04:20 GMT
బాలీవుడ్ సినిమాల్ని చూసి.. సౌత్ మూవీస్ భయపడే రోజులు పోయాయి. ఇప్పుడు మన సినిమాల్ని చూసే వాళ్లు భయపడుతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలాఖర్లో విడుదల కాబోయే ‘బాహుబలి: ది కంక్లూజన్’కు పోటీ వెళ్లడానికి ఏ బాలీవుడ్ సినిమా కూడా రెడీగా లేదు. ఈ విషయాన్ని స్వయంగా కరణ్ జోహారే ప్రకటించాడు. వచ్చే ఏడాది రాబోయే మరో సౌత్ ఇండియన్ మూవీ కూడా బాలీవుడ్ జనాల్ని ఇదే స్థాయిలో భయపెడుతోంది. ఆ చిత్రమే.. ‘2.0’. ‘రోబో’ సినిమాకు సీక్వెల్‌ గా శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 19న ఈ చిత్రం రిలీజయ్యే అవకాశాలున్నాయి.

నవంబరు 20న ‘2.0’ ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తూ దీపావళి విడుదల అని ప్రకటించారో లేదో.. బాలీవుడ్ జనాలు అలెర్టయిపోయారు. ఆల్రెడీ ఆ పండక్కి రిలీజ్ డేట్ ప్రకటించేసిన ‘గోల్ మాల్-4’ను వాయిదా వేయడానికి నిర్ణయించారు. ‘2.0’కు పోటీగా తమ సినిమాను రిలీజ్ చేయబోమని దర్శకుడు రోహిత్ శెట్టి ప్రకటించాడు. తనకు రజినీకాంత్ అంటే ఎంతో ఇష్టం.. గౌరవం అని.. అందుకే ఆయన సినిమాతో పోటీ పడబోనని అన్నాడు రోహిత్. ఇక్కడ ఇష్టం.. గౌరవం కంటే కూడా భయం ఎక్కువ ఉందన్నది వాస్తవం. మామూలుగానే రజినీకాంత్ సినిమాలకు ఉత్తరాదిన కూడా మంచి ఆదరణ ఉంటుంది. అందులోనూ రోబో సీక్వెల్ అంటే యూనివర్శల్ మూవీ అవుతుంది. దీనికి తోడు అక్షయ్ కుమార్ ఇందులో విలన్ పాత్ర పోషిస్తుండటంతో దేశవ్యాప్తంగా ‘2.0’ హంగామా ఉంటుంది. అందుకే ‘గోల్ మాల్-4’ రిలీజ్ డేట్ మార్చుకోక తప్పలేదు. దీంతో పాటు వచ్చే ఏడాది దీపావళికి షెడ్యూల్ అయిన వేరే హిందీ సినిమాల్ని కూడా వాయిదా వేసేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News