హీరోయిన్ గా రాణించి.. నిర్మాతగా దెబ్బతిని.. రాజకీయాల్లో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ముందుకుసాగి.. రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు ఆర్కే రోజా. తొలిసారిగా ఆమె ఉన్న పార్టీ (వైసీపీ) అధికారంలోకి వచ్చింది. 1999 ఎన్నికల్లో చంద్రబాబుకు వీరాభిమానిగా ఉంటూ.. టీడీపీ తరఫున దూకుడుగా ప్రచారం చేశారు రోజా. నాటి ఎన్నికల్లో ఆమె వాగ్ధాటి.. అప్పటి వాతావరణం బాగా కలిసొచ్చి టీడీపీ అధికారం కైవసం చేసుకుంది. అయితే, నాటి ఎన్నికలకు ముందు రోజా టీడీపీలో చేరినా.. రాజకీయంగా పదవులు అనుభవించలేదు.
పార్టీపరంగా తెలుగు మహిళ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2004 ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇవ్వలేదు. కానీ, ప్రత్యర్థి పార్టీలపై విమర్శల పరంగా ఈమెను టీడీపీ బాగా ఉపయోగించుకుంది. సహజంగానే వాక్చాతుర్యం కలిగిన రోజా అప్పటి అధికార కాంగ్రెస్ ను, వైఎస్సార్ పాలనను తీవ్రంగా విమర్శించారు.
2008లో ఆవిర్భవించిన ప్రజారాజ్యం పార్టీనీ రోజా టార్గెట్ చేసుకున్నారు. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కల్యాణ్ లను తీవ్రంగా ఎండగట్టారు. ఓ దశలో రోజా చేసిన వ్యాఖ్యలు బాగా వివాదస్పదం అయ్యాయి. చివరకు సినీ పరిశ్రమ వారు ఒకరిపై ఒకరు నేరుగా విమర్శలు చేసుకోకూడదనే అవగాహన కూడా జరిగిందని నాడు చెప్పుకొన్నారు.
మొత్తానికి 2004-2009 మధ్య రోజా రాజకీయంగా కీలక వ్యక్తిగా నిలిచారు. ఈ పరిణామాలత్ 2009 ఎన్నికల్లో ఆమెకు టీడీపీ టికెట్ ఇచ్చింది. అయితే, ఆమె ఓడిపోయారు. ఆ వెంటనే ప్లేటు ఫిరాయించి అప్పటి సీఎం వైఎస్సార్ ను కలిశారు. మరికొన్ని రోజులకే వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడంతో రోజా రాజకీయ భవితవ్యం డోలాయమానంలో పడింది. ఈ దశలో ఆమె వైఎస్సార్సీపీలో చేరారు.
2014 ఎన్నికల్లో గెలుపొందినా.. పార్టీ అధికారంలోకి రాకపోవడంతో రోజాకు మళ్లీ ‘అధికార’ యోగం దూరమే అయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పడు దూకుడైన విమర్శలతో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులపై విరుచుకుపడిన రోజాను నాటి చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీకి రాకుండా సస్పెండ్ చేసింది.
కాగా, 2019 ఎన్నికల్లోనూ రోజా గెలవడం, పార్టీ కూడా అధికారంలోకి రావడంతో ఆమెకు మంత్రి పదవి ఖాయం అనుకున్నారు. చిత్తూరు జిల్లా రాజకీయ పరిణామాల రీత్యా రోజాకు మంత్రి పదవి దక్కలేదు. చివరకు ఏపీఐసీసీ అధ్యక్ష పదవి ఇచ్చి రోజా సేవలను గౌరవించారు సీఎం జగన్.
మంత్రిగిరీ రాలేదని కొంత అసమ్మతి తన స్థాయికి మంత్రి పదవిని ఆశించిన రోజా అది దక్కకపోవడంతో అసంత్రప్తికి గురయ్యారనేది టాక్. నియోజకవర్గ పార్టీ రాజకీయాలతో సైతం రోజా కొంత మనస్తాపం చెందారని వైసీపీ వర్గాలు చెబుతుంటాయి. ఓ దశలో రోజా తీవ్ర నిరాశతో ‘‘రాజకీయ మార్పు’’ కోరుకుంటున్నారనీ ప్రచారం జరిగింది.
ఇందులో వాస్తవమెంతో తేలాల్సి ఉన్నప్పటికీ.. ఇటీవల ఆమె మాత్రం రాజకీయంగా చురుగ్గా వ్యవహరించడం లేదు. ఎక్కువగా చెన్సై, హైదరాబాద్ లో ఉంటున్నారనీ పేరొచ్చింది. మరోవైపు రోజా జడ్జిగా వ్యవహరిస్తున్న సూపర్ హిట్ షో జబర్దస్త్.. ఎక్స్ట్ ట్రా జబర్దస్త్ ప్రజల్లోకి చొచ్చుకెళ్లాయి. మెగా బ్రదర్ నాగబాబు నిష్క్రమణతో రోజానే ఇప్పుడు ఈ షోలకు పెద్ద దిక్కు అన్నది వాస్తవం.
సినీ నేపథ్యం ఉన్న రోజా స్పందనేమిటి? సినిమా టిక్కెట్ల విషయమై ప్రస్తుతం ఏపీ సర్కారు, టాలీవుడ్ కు పెద్ద సమరం జరుగుతున్న సంగతి తెలిసిందే. టికెట్ రేట్లు తగ్గించడం మీద నేచురల్ స్టార్ నాని, తమిళ- తెలుగు హీరో సిద్ధార్థ .. ఏపీ సర్కారు తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు.
టికెట్ల రేటు తగ్గిస్తే సినిమాలకు లాభాలు రావు అని సినీ పెద్దలు వాపోతున్నారు. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం పై హీరో నాని, సిద్దార్థ్ కామెంట్ చేయడంతో మంత్రులు రంగంలోకి దిగారు. టాలీవుడ్ సినిమాల పై కౌంటర్లు వేస్తున్నారు. రెమ్యునరేషన్‌తో సహా సినిమా మేకింగ్‌కి అయ్యే ఖర్చు తగ్గించుకోండి. ఆ డిస్కౌంట్ అప్లై చేసి వీక్షకులకు తక్కువ రేట్‌లో సినిమా చూపించండి అని ఏపీ మంత్రులు కొందరు హీరోలకు చురకలు అంటిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఎమ్మెల్యే రోజా ఈ వ్యవహారం పై స్పందించారు.
ఈ నేపథ్యంలో సినీ నేపథ్యం ఉన్న రోజా స్పందనేమిటా? అని చాలామంది ఎదురుచూశారు. 30 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉంటూ.. ఆమె ఎదుగుదలకు కారణమైన పరిశ్రమ విషయంలో ఎలా స్పందిస్తారనే ఆసక్తి నెలకొంది. ఎట్టకేలకు తాజాగా ఆమె టికెట్ రేట్ల వ్యవహారంపై నోరు విప్పారు. సీఎం జగన్ ఏం చేసినా పేదలకు మంచి జరిగేలానే చూస్తారని రోజా అన్నారు. పెద్ద సినిమాల గురించి ఆలోచిస్తున్నారే కానీ చిన్నసినిమాల గురించి ఆలోచించడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కమిటీ అన్ని విషయాలను పరిష్కరిస్తుంది రోజా తెలిపారు.
నానిని అంత మాటనేసిందా?
కాగా, ఏపీలో సినిమా థియేటర్ వారి కంటే పక్కనుండే కిరాణం దుకాణం వారికి ఎక్కువ ఆదాయం వస్తోందంటూ నేచురల్ స్టార్ నాని చేసిన కామెంట్లు పేలాయి. ఆయన ట్యాగ్ కు తగ్గట్లే కామెంట్స్ కూడా ‘‘నేచురల్ ’’గా ఉన్నయన్న వ్యాఖ్యలు వినిపించాయి. చివరకు ఏపీ ప్రభుత్వం దీనిపై స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
మంత్రుల స్పందన అలా ఉంచితే.. రోజా ఇప్పుడు నాని వ్యాఖ్యలపై మాట్లాడారు. ‘‘నానికి సినిమా థియేటర్ల కంటే కిరాణా కొట్టు వ్యాపారం బాగా ఉందన్నప్పుడు ఆయన సినిమాలు చేయడం వేస్ట్.. కిరాణా వ్యాపారమే చేసుకోవచ్చు. ఇలాంటి వాఖ్యలు రెచ్చగొట్టడమే అవుతుంది’’అంటూ రోజా మండిపడ్డారు.
‘‘ఇలాంటి వ్యాఖ్యల వల్ల సినిమా పరిశ్రమ మరింత నష్టపోయే అవకాశం ఉంటుంది. కొద్దిమంది రాజకీయ ఉనికిని చాటుకునేందుకు, పార్టీలు పెట్టిన వారి వల్లే ఇలాంటి వివాదాలు వస్తున్నాయి’’ అని ఆమె అన్నారు. చిత్రమేమంటే.. ఎక్స్ ట్రా జబర్దస్త్ కు గతేడాది ఓసారి నాని సహ జడ్జిగా వ్యవహరించారు. ఆ సమయంలో రోజా, నాని ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
కొసమెరుపు పనిలో పనిగా మూడు నెలల క్రితం జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలపైనా రోజా మాట్లాడారు. ‘‘కొద్దిమంది నోటి దురద వల్లే మా ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ ను తలపించాయి. రాజకీయ పార్టీ పెట్టి సినిమాలు తీస్తున్న వ్యక్తి వల్లనే ఇదంతా జరుగుతుంది. సినిమా పరిశ్రమలో ఎవరికి తోచినట్టు వారు మాట్లాడటం వల్లే ఇదంతా జరుగుతోంది’’అంటూ పరోక్షంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైనా రోజా మండిపడ్డారు. మంచి ఉదేశంతో చర్చలకు వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు.