చిత్రం: ‘రోజులు మారాయి’
నటీనటులు: పార్వతీశం - చేతన్ - తేజస్వి మదివాడ - కృతిక జయకుమార్ - ఆలీ - వాసు ఇంటూరి తదితరులు
సంగీతం: జె.బి
ఛాయాగ్రహణం: బాల్ రెడ్డి
మాటలు: రవి నంబూరి
నిర్మాత: జి.శ్రీనివాసరావు
కథ - స్క్రీన్ ప్లే: మారుతి
దర్శకత్వం: మురళీకృష్ణ ముదిదాని
దర్శకుడిగా అరంగేట్రం చేశాక చాలా తక్కువ కాలంలోనే తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నాడు దాసరి మారుతి. అతడి ప్రొడక్షన్లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. అందులో అతను రచన అందించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఐతే మధ్యలో కొన్నాళ్లు ప్రొడక్షన్.. రైటింగ్ పక్కనబెట్టేసిన మారుతి.. కొంత విరామం తర్వాత ‘రోజులు మారాయి’తో మళ్లీ లైన్లోకి వచ్చాడు. ఈ సినిమాకు కథ-స్క్రీన్ ప్లే అతడివే. దిల్ రాజు లాంటి ప్రముఖ నిర్మాతతో కలిసి మారుతి ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఈ కలయికే ‘రోజులు మారాయి’ మీద ఆసక్తి రేకెత్తించింది. కొత్త దర్శకుడు మురళీకృష్ణ రూపొందంచిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
పీటర్ (పార్వతీశం).. అశ్వథ్ (చేతన్) తాము ప్రేమించిన అమ్మాయిలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అబ్బాయిలు. రంభ (తేజస్వి) అనే అమ్మాయి కోసం పీటర్ తన ఉద్యోగాన్నే త్యాగం చేస్తే.. ఆధ్య (కృతిక)కు అన్నీ తానై వ్యవహరిస్తూ ఆమె అవసరాలు తీరుస్తుంటాడు అశ్వథ్. కానీ వాళ్లిద్దరూ మాత్రం వేరే వాళ్లను ప్రేమిస్తూ.. వీళ్లను తమ అవసరాలకు వాడేసుకుంటూ ఉంటారు. ఇంతలో తమ భవిష్యత్తు తెలుసుకోవడం కోసం ఈ అమ్మాయిలిద్దరూ ఓ బాబాను కలవగా.. వీళ్లకు కాబోయే భర్తలు పెళ్లయిన మూడు రోజులకే చనిపోతారని చెబుతాడు. దీంతో పీటర్-అశ్వథ్ లను పెళ్లి చేసుకుని.. వాళ్లిద్దరూ చనిపోగానే తాము ప్రేమిస్తున్న వాళ్లతో సెటిలైపోవాలని ప్రణాళిక రచించుకుంటారు రంభ-ఆధ్య. మరి వారి ప్రణాళిక ఫలించిందా..? వీళ్లను పెళ్లి చేసుకున్నాక పీటర్-అశ్వథ్ నిజంగానే చనిపోయారా..? రంభ-ఆధ్య ప్రేమించిన వాళ్ల సంగతేంటి.. అన్నది తెరమీదే చూడాలి.
కథనం - విశ్లేషణ:
మారుతి బ్రాండ్ సినిమాల్లో చాలా వరకు ఈ తరం అమ్మాయిలు చాలా ముదుర్లు.. అబ్బాయిలు అమాయకులు అన్నట్లుంటుంది వ్యవహారం. ‘రోజులు మారాయి’ సినిమాకు కాన్సెప్టే అదే అయింది. ఈ తరం అమ్మాయిలు అబ్బాయిల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారో.. ఎలా డబుల్ గేమ్స్ ఆడుతున్నారో సినిమాటిగ్గా బాగా ఎగ్జాజరేట్ చేసి చూపించారు ‘రోజులు మారాయి’లో. ఈ కాన్సెప్ట్ నుంచే వినోదాన్ని పండించే ప్రయత్నం చేశారు.
పార్వతీశం లాంటి మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటుడు మారుతి-మురళీకృష్ణలకు దొరకడంతో అతడి పాత్ర ద్వారా మాగ్జిమం ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి చూశారు. ఐతే ‘రోజులు మారాయి’ కాన్సెప్ట్ కు కట్టుబడి నడిచినంతసేపూ బాగానే అనిపిస్తుంది. కానీ ద్వితీయార్ధంలో మాత్రం మారుతి అండ్ కో మళ్లీ ‘ప్రేమకథా చిత్రమ్’ చూపించి.. చికాకు పెడుతుంది. ప్రథమార్ధంలో కథ మంచి మలుపు తీసుకున్నా.. ఏదో ముగించాలి తప్పదన్నట్లు మొక్కుబడిగా రొటీన్ ఫార్మాట్లో రెండో అర్ధభాగాన్ని నడిపించడంతో ‘రోజులు మారాయి’ నిరాశ పరుస్తుంది. మొహం మొత్తేసిన హార్రర్ కామెడీతో ద్వితీయార్ధాన్ని నీరుగార్చేశారు.
మారుతి కథాకథనాల విషయంలో నేలవిడిచి సాము చేయడు. అతడి కథలు చాలా సింపుల్ గా ఉంటాయి. ఈ తరం ప్రేక్షకులు ఈజీగా కనెక్టయ్యేలా ట్రెండీగా ఉంటాయి. ముఖ్యంగా ఇప్పటి అబ్బాయిలు అమ్మాయిల మనస్తత్వాలు.. ప్రేమ-పెళ్లి విషయంలో వాళ్ల అభిప్రాయాల నేపథ్యంలో కథల్ని నడిపిస్తుంటాడు. ‘రోజులు మారాయి’ కూడా అదే తరహాలో సాగుతుంది. కథగా చెప్పుకోవడానికి ఇందులో పెద్దగా ఏమీ లేదు. జాతకం ప్రకారం తమకు కాబోయేళ్లు చనిపోతారని తెలిసి.. హీరోయిన్లు ఇద్దరు బకరాల్ని చూసి పెళ్లాడటం అనేది ‘మిత్రుడు’ సినిమా స్ఫూర్తితో తీసుకున్న కాన్సెప్ట్. ఇక స్క్రీన్ ప్లే విషయంలో కూడా కొన్ని సినిమాల ఛాయలు కనిపిస్తాయి. ‘దృశ్యం’.. ‘ఫైనల్ డెస్టినేషన్’ లాంటి సినిమాల స్ఫూర్తితో సన్నివేశాల్ని అల్లుకున్న తీరు ఆకట్టుకుంటుంది.
ప్రథమార్ధానికి పార్వతీశం పాత్ర ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ తరం అమ్మాయిలపై అతను వేసే సెటైర్లు పేలాయి. మరోవైపు తేజస్వి చలాకీ నటనతో.. పంచ్ డైలాగులతో ఆకట్టుకుంటుంది. ప్రథమార్ధాన్ని వీళ్లిద్దరి పాత్రలే నడిపిస్తాయి. నిడివి కూడా తక్కువ కావడంతో ప్రథమార్ధం వేగంగా సాగిపోతుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్టు ఆసక్తి రేకెత్తిస్తుంది. కానీ ఆ తర్వాత ఈ ఆసక్తిని నిలబెట్టడంలో ‘రోజులు మారాయి’ విఫలమైంది. ద్వితీయార్ధమంతా ప్రెడిక్టబుల్ గా ఉండడం.. ప్రథమార్ధాన్ని నడిపించిన పార్వతీశం పాత్ర పక్కకు వెళ్లిపోవడంతో ప్రేక్షకులు బోర్ ఫీలవుతారు. ఆలీ పాత్రతో చేయించిన కామెడీ నిష్ఫలమైంది. అసలేం జరిగి ఉండచ్చన్నది ప్రేక్షకులు ముందే ఓ అంచనాకు వచ్చేస్తారు కాబట్టి.. క్లైమాక్స్ కూడా ఏమీ థ్రిల్ చేయదు. ముగింపు కూడా మామూలుగా అనిపిస్తుంది. దిల్ రాజు హ్యాండ్ పడటం వల్లో ఏమో.. మారుతి మార్కు బూతులేమీ ఇందులో లేవు. రొమాన్స్ డోస్ కూడా పెద్దగా లేదు.
నటీనటులు:
‘రోజులు మారాయి’లో ఒక జంట మాత్రమే ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. రెండో జంట ఏదో ఉందంటే ఉందన్నట్లుంటుంది అంతే. పార్వతీశం సినిమాకు మెయిన్ పిల్లర్. అతడి కామెడీ టైమింగ్ మరోసారి ఆకట్టుకుంటుంది. కనిపించినంతసేపూ అతను నవ్వించాడు. కొన్ని మామూలు డైలాగుల్ని కూడా పార్వతీశం తనదైన శైలిలో పలికి నవ్వులు పంచాడు. తేజస్వి కూడా బాగానే చేసింది. ఐతే చేతన్-కృతిక మాత్రం చేసిందేమీ లేదు. కృతిక అయినా కొన్ని సన్నివేశాల్లో పర్వాలేదు కానీ.. చేతన్ మాత్రం సింగిల్ ఎక్స్ ప్రెషన్ తో లాగించేశాడు. అసలే డల్ ఫేస్ అంటే.. అతను మరీ మొక్కుబడిగా నటించాడు. ఆ పాత్ర అసలేమాత్రం ఇంపాక్ట్ చూపించదు. వాసు ఇంటూరి తనదైన శైలిలో కొన్నిచోట్ల నవ్వించాడు. ఆలీ పాత్ర వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయింది.
సాంకేతిక వర్గం:
జె.బి సంగీతం సోసోగా అనిపిస్తుంది. పాటలు.. నేపథ్య సంగీతం పర్వాలేదనిపిస్తాయి. ఏదో సినిమాకు తగ్గట్లుగా అలా లాగించేశాడతను. కెమెరామన్ హార్రర్ కామెడీ అనగానే డీఫాల్ట్ గా కొన్ని కెమెరా యాంగిల్స్ ఫిక్సయినట్లున్నాడు. పదే పదే తీసుకెళ్లి నటీనటుల ముఖాల్లో కెమెరా పెట్టడం.. వర్మ సినిమాల తరహాలో కెమెరాను ఎక్కడెక్కడో సెట్ చేయడం.. ఇలాంటి ప్రయత్నాలేవో చేశాడతను. కొన్నిసార్లు ఈ కెమెరా యాంగిల్స్ ఆక్వర్డ్ గా అనిపిస్తాయి. రవి నంబూరి.. మారుతి టేస్టుకు తగ్గట్లుగా మాటలు రాశాడు. చాలాచోట్ల పంచ్ డైలాగులు పేలాయి. నిర్మాణ విలువలు పర్వాలేదు. మారుతి కథాకథనాల్లో కొన్నిచోట్ల తన ముద్ర చూపించాడు. ఐతే తాను పాపులర్ చేసిన ‘హార్రర్ కామెడీ’ బ్రాండును అందరూ అరగదీసేశాక ఇప్పుడు మళ్లీ దాన్నే ట్రై చేయడం నిరాశ పరుస్తుంది. దర్శకుడు మురళీ కృష్ణ పర్వాలేదనిపించాడు. అతడిదంటూ ప్రత్యేకమైన ముద్ర ఏమీ కనిపించలేదు. మారుతి స్టయిల్లోనే సినిమాను రూపొందించాడు. పిండి కొద్దీ రొట్టె అన్నట్లు.. మారుతి అందించిన ఏవరేజ్ స్క్రిప్టును అంతే ఏవరేజ్ గా తెరకెక్కించాడతను.
చివరగా: రోజులు మారాయి.. కొన్ని నవ్వుల కోసం
రేటింగ్- 2.5/5
Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre