రొమాంటిక్ బ్యూటీకి 100 ప‌ర్సంట్ రంగు ప‌డే ఛాన్స్

Update: 2020-03-16 06:45 GMT
ఆకాష్ పూరి స‌ర‌స‌న‌ రొమాంటిక్ సినిమాతో దిల్లీ బ్యూటీ కేతిక శ‌ర్మ ప‌రిచ‌య‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ లో ఈ అమ్మ‌డికి తొలి సినిమా ఇది. ఇంత‌కుముందు కేతిక ఫ‌స్ట్ లుక్ ని పూరి-ఛార్మి బృందం రిలీజ్ చేయ‌గా వాటికి రెస్పాన్స్ అదిరింది. ఇప్ప‌టికే రొమాంటిక్ లో టాప్ లెస్ ఫోజ్ ల‌తో కేతిక గుబులు రేపింది. కుర్ర‌హీరో ఆకాష్ ని ఘాడంగా హ‌త్తుకుపోతూ ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తోన్న స్టిల్ ఇంత‌కుముందు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అయింది. అలాగే బీచ్ ఒడ్డున పొట్టినిక్క‌రులో రొమాంటిక్ యాంగిల్ ని చూపించి క‌ల‌వ‌ర పెట్టింది. రిలీజ్ కు ముందే పూరి స్టైల్ పోస్ట‌ర్ తో సొగ‌స‌రి టాలీవుడ్ స‌ర్కిల్స్ ని ఆక‌ర్షించింది. ముఖ్యంగా యూత్ డ్రీమ్ గాళ్ గా మారింది. ఇక పెద్ద తెర‌పై ఆకాష్ తో రొమాన్స్ ఏ రేంజులో చేసింది అన్న‌ది సినిమా చూస్తే కానీ చెప్ప‌లేం.

డెబ్యూ సినిమాతో సంబంధం లేకుండానే ఈ అమ్మ‌డు సెకెండ్ ఛాన్స్ అందుకోవ‌డం ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది. యంగ్ హీరో నాగ‌శౌర్య క‌థానాయ‌కుడిగా సుకుమార్ స‌హాయ‌కుడు కాశీ విశాల్ ఓ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాగ‌శౌర్య‌కి జోడీగా కేతిక శ‌ర్మ‌ని ఎంపిక చేసారు. దీంతో ఈ భామ‌ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నేటి త‌రం నాయిక‌ల మ‌ధ్య గ‌ట్టి పోటీ ఉన్నా! రొమాంటిక్ రిలీజ్ కాకుండానే అప్పుడే సెకెండ్ ఛాన్సా? అని మిగ‌తా నాయిక‌లు అవాక్క‌వుతున్నారు. శౌర్య చిత్రాన్ని సుకుమార్-శ‌ర‌త్ మ‌రార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ అని స‌మాచారం.

మ‌రి శౌర్య‌- కేతిక జంట కోసం 100 ప‌ర్సంట్ రొమాంటిక్ స్క్రిప్టును సుకుమార్ సిద్ధం చేసాడా? కాశీ విశాల్ క్రియేటివిటీ రేంజ్ ఎంత‌? అన్న‌ది తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం సుకుమార్ ఉప్పెన సినిమాకు స్క్రిప్ట్ అందించి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి సుక్కూ శిష్యుడు.. కుమారి 21ఎఫ్ ఫేం ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మొత్తానికి ఢిల్లీ బ్యూటీ తో సుక్కూ లాలూచీ బావుంది. కొత్త సినిమాలు ప్రారంభిస్తూ కొత్త ట్యాలెంటుకు అవ‌కాశాలిస్తూ చాలా బాగానే ఆడుతున్నాడు ఆట‌.
Tags:    

Similar News