'మోస్ట్‌ డిజైరబుల్‌ మ్యాన్‌-2020' గా విజయ్ దేవరకొండ..!

Update: 2021-06-02 09:30 GMT
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలతోనే కాకుండా తన యాటిట్యూట్ తో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో వరుస సినిమాలు చేసినా చేయకపోయినా.. సక్సెస్ లో ఉన్నా లేకపోయినా తన క్రేజ్ ఏమాత్రం తగ్గదని అనేకసార్లు నిరూపించాడు. తాజాగా 2020 సంవత్సరానికి గాను హైదరాబాద్ టైమ్స్ మోస్ట్‌ డిజైరబుల్‌ మ్యాన్‌ గా ఘనత దక్కించుకున్నాడు. ఇప్పటికే రెండుసార్లు మోస్ట్‌ డిజైరబుల్‌ మ్యాన్‌ గా నిలిచిన విజయ్ దేవరకొండ.. వరుసగా మూడోసారి నెం.1 స్థానం సాధించి హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇంతవరకు మూడుసార్లు వరుసగా ఈ ఘనత సాధించిన వ్యక్తి లేరు. ఇప్పుడు విజయ్ ఈ ఫీట్ ని అందుకోవడం బిగ్ అచీవ్ మెంట్ గా చెప్పవచ్చు.

'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా పరాజయం చెందిన తర్వాత విజయ్‌ దేవరకొండ నుంచి ఏడాదిన్నరగా మరో సినిమా రాలేదు. అయినప్పటికీ అతన్ని సోషల్‌ మీడియాలో విపరీతంగా ఫాలో అవడం.. అతని గురించి చర్చించడం చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ టైమ్స్ 'మోస్ట్‌ డిజైరబుల్‌ మ్యాన్‌ 2020' గా ఎంపిక కావడాన్ని దీనికి నిదర్శనం. ఇకపోతే విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'లైగర్' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో VD పాపులారిటీ బౌండరీస్ దాటుతుందని చెప్పవచ్చు. దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు విజయ్.
Tags:    

Similar News