బెదిరింపులొచ్చినా ఫేస్ చేయ‌డానికి రెడీ-ఆర్పీ

Update: 2016-11-01 10:10 GMT
మీడియా ఇగోని ప్ర‌శ్నించ‌డానికి మ‌న‌లో ఒక‌డు అంటూ సంగీత ద‌ర్శ‌కుడు ఆర్.పి.ప‌ట్నాయ‌క్ ఈ శుక్ర‌వారం మ‌న ముందుకు రాబోతున్నాడు. గ‌తంలో బ్రోక‌ర్ లాంటి సినిమాను ఓ సోషియ‌ల్ ఎలిమెంట్ ను తీసుకుని ఎలివేట్ చేసిన ఈ సంగీత ద‌ర్శ‌కుడు.. ఇప్పుడు మీడియా ఓవ‌ర్ యాక్ష‌న్ ను వెండితెర‌పై చూపించ‌బోతున్నాడు. చానెల్స్ రేటింగ్ కోసం సెన్సేష‌న్ క్రియేట్ చేస్తూ... ప్ర‌జ‌ల‌ను క‌న్ ఫ్యూజ‌న్ చేస్తున్నాయ‌ని... దానినే వెండితెర‌పై ప్ర‌శ్నించ‌బోతున్నా అంటున్నాడు.

ఇంకా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ఈ మూవీ రిలీజైన త‌రువాత మీడియా నుంచి బెదిరింపులొచ్చినా ఫేస్ చేయ‌డానికి రెడీ అయ్యే ఈ సినిమాను తీశా. మీడియాలో వున్న ఇగోని ప్ర‌శ్నించే ఓ సామాన్య లెక్చ‌ర‌ర్ కృష్ణ‌మూర్తి పాత్ర‌లో న‌టించా. కొంత మంది మీడియా మిత్రుల ద్వార‌నే కొన్ని ఇన్ పుట్స్ తీసుకుని.. నేను చూసిన‌.. నాకు ఎదురైన సంఘ‌ట‌న‌ల‌ను బేస్ చేసుకుని ఈ క‌థ‌ను రాసుకుని తెర‌కెక్కించాన‌న్నారు.

గ‌తంలో నా చిత్రాల‌కు ప‌బ్లిసిటీ లేక బాక్సాఫీస్ వ‌ద్ద నిల‌బ‌డ‌లేక‌పోయాయి. కానీ ఈ సినిమాకు ప‌బ్లిసిటీ బాగుంది. ఇప్ప‌టికే నాకు తెలిసిన కొంత మంది సామాన్యుల‌కు సినిమా చూపించా. చాలా గొప్ప సినిమా తీశావ‌ని ప్ర‌శంసించారు. ఈ సినిమా చూసిన త‌రువాత మీరు కూడా మెచ్చుకుంటారు. రామోజీరావుగారిని క‌లిసిన‌ప్పుడు కూడా ఆయ‌న.. మీడియాలో ఇగో బాగా పెరిగిపోయింది. క‌చ్చితంగా ప్ర‌శ్నించాల్సిన అవ‌స‌రం వుంద‌న్నారు. త‌ప్ప‌కుండా ఈ సినిమా అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంద‌ని న‌మ్ముతున్నా అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News