పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ కి సంబంధించిన ప్రతిదీ అభిమానుల్లో వేగంగా వైరల్ అవుతోంది. కొద్ది రోజుల క్రితం.. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి స్వయంగా RRR క్లైమాక్స్ ను హైదరాబాద్ ఆర్.ఎఫ్.సీలో చిత్రీకరిస్తున్నామని వెల్లడించారు. ఈ చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా శరవేగంగా పూర్తవుతోంది.
సినిమా విజయానికి ఎంతో కీలకమైన.. క్లైమాక్స్ పోరాటం ప్రత్యేకత ఏమిటి? అన్నది ఆరా తీస్తే ఆన్ లొకేషన్ నుంచి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి. క్లైమాక్స్ సీక్వెన్స్ లో ఎన్.టి.ఆర్- రామ్ చరణ్ గగుర్పొడిచే విన్యాసాల్ని ప్రదర్శిస్తారని తాజాగా ఓ లీక్ అందింది. గూస్ బంప్స్ తో ప్రేక్షకులు కుర్చీ అంచుపైకి జరిగేంత ఎగ్జయిట్ మెంట్ ని కలిగించేదిగా క్లైమాక్స్ ఉంటుందట.
ఈ పోరాట సన్నివేశానికి.. రాజమౌళి స్వయంగా థ్రిల్స్ కొరియోగ్రాఫ్ చేశారని... సన్నివేశంలో ఎమోషన్ ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్త పడుతున్నారని తెలిసింది. పతాక సన్నివేశాల్లో దేశభక్తి ఎలిమెంట్ హైలైట్ గా ఉంటుంది. సినిమా ఆద్యంతం దేశభక్తి ప్రధాన హైలైట్ గా ఉంటుంది. డీవీవీ దానయ్య అత్యంత భారీ బడ్జెట్ తో ఆర్.ఆర్.ఆర్ ను నిర్మిస్తున్నారు. మరకతమణి ఎం.ఎం. కీరవణి సంగీతం అందిస్తున్నారు. ఆలియాభట్.. ఒలీవియా.. సముదిరకని తదితరులు నటిస్తున్నారు.