దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ ''ఆర్.ఆర్.ఆర్''. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కథానాయకులుగా నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ అంచనాలకు తగ్గట్టుగానే ట్రిపుల్ ఆర్ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 'RRR' మూవీ ఎలక్ట్రానిక్ - డిజిటల్ - శాటిలైట్ రైట్స్ ప్రముఖ బాలీవుడ్ సంస్థ పెన్ స్టూడియోస్ వారు దక్కించుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
జయంతిలాల్ గడ ఆధ్వర్యంలోని పెన్ స్టూడియోస్ సంస్థ 'ఆర్.ఆర్.ఆర్' నార్త్ థియేట్రికల్ రైట్స్ తో పాటుగా అన్ని భాషల్లో ఎలక్ట్రానిక్ - డిజిటల్ - శాటిలైట్ హక్కులు తీసుకున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఎపిక్ డ్రామాని సమర్పిస్తున్నందుకు గౌరవంగా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాని పెన్ స్టూడియోస్ వారు పేర్కొన్నారు. అయితే ఈ డీల్ కోసం బాలీవుడ్ సంస్థ పోటీపడి మరీ భారీ ధర చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. పెన్ స్టూడియోస్ బ్యానర్ పై మాస్ మహారాజా రవితేజ 'ఖిలాడి' - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీ డెబ్యూ 'ఛత్రపతి' రీమేక్ లను జయంతి లాల్ నిర్మిస్తున్నారు.
కాగా, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ పాన్ ఇండియా చిత్రంలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్.. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. ఆలియా భట్ - ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.