`బాహుబలి` తో తెలుగు సినిమా రేంజ్ ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఈ మూవీ తరువాత టాలీవుడ్ క్రేజ్ మరింత పెరిగింది. ఇక్కడ సినిమా అనౌన్స్ అయిందంటే చాలు యావత్ దేశం మొత్తం అటెన్షన్ క్రియేట్ కావడం మొదలైంది. దీనికి ప్రధాన కారణం దర్శకధీరుడు జక్కన్న. ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ గతిని, గమనాన్ని మార్చిన దర్శకుడు రాజమౌళి. అలాంటి దర్శకుడి నుంచి మరో సినిమా వస్తోందంటే దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంటుంది. ఇప్పడు `ఆర్ ఆర్ ఆర్` విషయంలోనూ అదే జరుగుతోంది.
ఇద్దరు క్రేజీ స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో జక్కన్న తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ మూవీ కావడంతో ఈ చిత్రంపై సహజంగానే అంచనాలు స్కై హైకి చేరుకున్నాయి.
రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా ఓ రేంజ్‌లో వుండటంతో సినిమా భారతీయ సినీ ప్రియులకు నెవర్ బిఫోర్ ఎక్స్‌పీరియన్స్ ని అందించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రేక్షకుల్లో `బాహుబలి` తరువాత వస్తున్న తన తదుపరి సినిమాపై అంచనాలు భారీగా వుంటాయని ముందుగానే పసిగట్టిన రాజమౌళి అందుకు తగ్గట్టుగానే ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు.
`బాహుబలి`ని 2డీ వెర్షన్ లో మాత్రమే అందించి అబ్బుర పరిచిన రాజమౌళి `ఆర్ ఆర్ ఆర్` ని మాత్రం అంతకు మించిన స్థాయిలో తెరపైకి తీసుకొచ్చారు. ఈ మూవీ థియేటర్లలోకి రావడానికి దాదాపు మూడున్నరేళ్లు పట్టింది. ఈ సమయాన్ని తనకు అనువుగా మార్చుకున్న రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ని ఎవరూ ఊహించని వెర్షన్ లలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేశారు. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తామంటూ ఈ సినిమాతో నిరూపించబోతున్నారు.
ఇంత వరకు ఏ ఇండియన్ సినిమా విడుదల కాని ఫార్మాట్ లలో `ఆర్ ఆర్ ఆర్` ని రెడీ చేసి ఆడియన్స్ కి ఐ ఫీస్ట్ ని అందించబోతున్నారు. భారీ స్థాయిలో విజువల్ వండర్ గా తెరకెక్కిన `ఆర్ ఆర్ ఆర్`తో ప్రేక్షకులకు నెవర్ బిఫోర్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతున్నారు. ఈ మూవీని 3డీ ఫార్మాట్ లో సరికొత్తగా అందించబోతున్నారు. 3డీ ఫార్మాట్ తో పాటు ఐమాక్స్ వెర్షన్ ని కూడా విడుదల చేస్తున్నారట. ఇదే విషయాన్ని మేకర్స్ ఆదివారం అధికారికంగా ప్రకటించారు.
గత కొంత కాలంగా ఈ మూవీ 3డీ ఫార్మట్ తో పాటు ఐమాక్స్ వెర్షన్ లోనూ విడుదల కానుందంటూ ప్రచారం జరుగుతున్నా ప్రేక్షకుల్లో మాత్రం 3డీ వెర్షన్ నిజమేనా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ అనుమానాలల్ని పటాపంచలు చేస్తూ నెవర్ బిఫోర్ యాక్షన్ డ్రామని 3డీలో మీ సమీప థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి అంటూ మేకర్స్ ఓ పోస్టర్ ని ఆదివారం విడుదల చేసి క్లారిటీ ఇచ్చారు. దీంతో అభిమానులు 3డీ వెర్షన్ లో ఆర్ ఆర్ ఆర్ ని ఎక్స్‌పీరియన్స్ చేసేందుకు రెడీ అవుతూ సంబరాలు చేసుకుంటున్నారు.