కరోనా సెకెండ్ వేవ్ కేసులు తగ్గు ముఖం పట్టడంతో పరిస్థితులు నెమ్మదిగా అదుపులోకి వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ని ఎత్తేస్తున్నారు. యాథావిధిగా కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతులిస్తోంది. దీనిలో భాగంగా సినిమా షూటింగ్ లు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. ఇటీవలే నితిన్ మ్యాస్ట్రో షూటింగ్ తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీంతో పాటు పలు చిన్న సినిమాలు కూడా షూటింగ్ లు రీ స్టార్ట్ చేసాయి. ఇంకా పలువురు అగ్ర హీరోల చిత్రాలు జులై నుంచి సెట్స్ కు వెళ్లడానికి రెడీ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ కూడా షూటింగ్ కు సన్నద్ధమవుతోంది. సోమవారం నుంచి యథావిధిగా షూటింగ్ చేసేందుకు దర్శకుడు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ టీమ్ అంతా షూట్ లో పాల్గొనాల్సి ఉంటుందని జక్కన్న ఆదేశాలిచ్చినట్లు సమాచారం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా రేపటి నుంచి షూట్ లో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో బ్యాలెన్స్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని యూనిట్ భావిస్తోంది. ఇంకా కేవలం 30 రోజుల బ్యాలెన్స్ షూటింగ్ మాత్రమే ఉంది.
మూడు పాటలు..కొంత టాకీ పార్టు పూర్తి కావాల్సి ఉంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే షెడ్యూల్ తో పాటు బ్యాలెన్స్ ని పూర్తి చేసి మిగతా పనులపై దృష్టి పెట్టాలని యూనిట్ రంగం సిద్దం చేసినట్లు తెలుస్తోంది.
అలియా భట్ పై షూట్ చేయాల్సిన సన్నివేశాల్ని తదుపరి షెడ్యూల్ తో మొత్తం పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్- ఎన్టీఆర్ కూడా ఎంత మాత్రం ఆలస్యం కాకుండా తమ నుంచి పూర్తి సహకారం అందించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని తొలుత భావించినప్పటి ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాని నేపథ్యంలో కొత్త రిలీజ్ తేదీపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై కూడా రాజమౌళి వీలైనంత త్వరగా క్లారిటీ ఇస్తారని అభిమానులు భావిస్తున్నారు.