బాహుబలి.. భారతీయ ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లి, వారికి అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించిన చిత్రం. చైనాలో అసాధారణ వసూళ్లు రావడం వల్ల 'దంగల్' ఈ చిత్రాన్ని అధిగమించింది కానీ.. వసూళ్ల పరంగా మామూలుగా చూస్తే ఏ ఇండియన్ సినిమా కూడా దీనికి దరిదాపుల్లోకి రాని విధంగా సరికొత్త రికార్డులను నెలకొల్పింది. దాంతో పోల్చి చూస్తే రాజమౌళి కొత్త సినిమా'ఆర్ఆర్ఆర్' ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో నచ్చలేదనే చెప్పాలి.
ఈ సినిమా కూడా భారీ వసూళ్లు రాబట్టినప్పటికీ.. 'బాహుబలి'తో పోలిస్తే చాలా తక్కువ అన్నది మన ప్రేక్షకుల మెజారిటీ అభిప్రాయం. ఐతే బాహుబలిని మనం మెచ్చినంతగా హాలీవుడ్ వాళ్లయితే మెచ్చలేదన్నది వాస్తవం.
ఆ సినిమా కూడా జపాన్ సహా కొన్ని దేశాల్లో అదరగొట్టినప్పటికీ.. హాలీవుడ్ దీన్ని గొప్ప సినిమాగా ఏమీ రేట్ చేయలేదు. అందులో మనం ఆశ్చర్యపోయిన యుద్ధ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ వారికి కొత్తగా అనిపించకపోవడం అందుకు కారణం కాచవ్చేమో.
కానీ 'బాహుబలి'తో పోలిస్తే మన వాళ్లకు తక్కువగా అనిపించిన 'ఆర్ఆర్ఆర్' మాత్రం హాలీవుడ్ ఫిలిం ఫెటర్నిటీకి, మీడియాకి, ఆ సినిమాలను ఆదరించే యుఎస్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేస్తుండటం, దీన్ని ఒక మాస్టర్ పీస్ లాగా అక్కడి వాళ్లు అభివర్ణిస్తుండటం విశేషం. 'ఆర్ఆర్ఆర్' థియేట్రికల్ రిలీజ్ టైంలోనే న్యూయార్క్ టైమ్స్ సహా ప్రధాన మీడియాలో సినిమాకు చాలా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అసలు మన సినిమాను అక్కడి మీడియా రివ్యూ చేయడమే ఆశ్చర్యం అంటే.. సినిమా సూపర్ అంటూ సమీక్షలు ఇవ్వడం విశేషం.
ఇక హాలీవుడ్ ఫిలిం సెలబ్రెటీల నుంచి సాధారణ యుఎస్ ఆడియన్స్ వరకు ఈ సినిమా మీద ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టుల వర్షం కురిపిస్తుండటం గమనార్హం. థియేట్రికల్ రిలీజ్ టైంలోనే ఈ ట్రెండ్ కనిపించగా.
ఇప్పుడు నెట్ ఫ్లిక్స్‌లో డిజిటల్ రిలీజ్ సందర్భంగా ఈ ట్రెండ్ మరింత ఊపందుకుంది. వెరిఫైడ్ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి పెద్ద ఎత్తున పోస్టులు కనిపిస్తున్నాయి. 'బాహుబలి'లో గ్రాఫిక్స్, వార్ సీన్స్ అయితే వాళ్లకు మామూలే అనిపించాయేమో కానీ ఇందులోని ఎమోషన్లు, కళ్లు చెదిరే యాక్షన్ సీక్వెన్స్‌లు అక్కడి వారిని కట్టి పడేసినట్లు కనిపిస్తోంది.