యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న RRR ట్రైలర్ రేపు విడుదల కాబోతోంది. దర్శకధీరుడు రాజమౌళి విజువల్ ట్రీట్ ఎలా ఉండబోతోందో.. ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఒకే స్క్రీన్ మీద ఎలా కనిపిస్తారో.. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్ - అలియా భట్ పాత్రలు ఎలా ఉంటాయో చూడాలని వేచి చూస్తున్నారు.
'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని 2022, జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్న జక్కన్న.. రేపు గురువారం (డిసెంబర్ 9) ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నారు. అయితే అంతకంటే ముందు స్పెషల్ పోస్టర్స్ వదులుతూ ట్రైలర్ పై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నారు.
తాజాగా RRR టీమ్ ఇందులో సీత పాత్రలో కనిపించనున్న హీరోయిన్ అలియా భట్ కు సంబంధించిన మేకింగ్ వీడియోని రిలీజ్ చేసింది. అలియా నుంచి ఆమె సీతగా మారే క్రమాన్ని చూపిస్తున్న ఈ వీడియో అలరిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ 'ఆర్.ఆర్.ఆర్' కోసం రాజమౌళితో చర్చలు జరపడం దగ్గర నుంచీ.. సీత పాత్రలో ఒదిగిపోయిన విధానం వరకు చూపించారు.
సీత పాత్రలో అలియా భట్ అద్భుతమైన నటన కనబరిచినట్లు తెలుస్తోంది. RRR ఆమెకు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ.. టాలీవుడ్ డెబ్యూ. దీని కోసం అమ్మడు బాగానే కష్టపడిందని అర్థమవుతుంది. పదహారణాల తెలుగమ్మాయిగా అలియా లుక్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా తెలుగు వర్షన్ లో తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకుందని సమాచారం.
'ఆర్.ఆర్ ఆర్' నుంచి ఇప్పటికే విడుదలైన అలియా భట్ ఫస్ట్ లుక్ విశేష స్పందన తెచ్చుకుంది. 'జనని' సాంగ్ లో కూడా తళుక్కున మెరిసింది. ట్రైలర్ లో కూడా ఆమె భాగం కానుంది. ఇందులో రామ్ చరణ్ కు జోడీగా అలియా కనిపించనుంది. సినిమాలో సీత పాత్ర ఎలా ఉండబోతుందో రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే వెల్లడించారు.
అలియా భట్ ఓ సర్ప్రైజ్ ప్యాకేజ్ అని.. ఆమె తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా ప్రతి సీన్ లోనూ ఆమే కనిపిస్తుందని తెలిపారు. ఇద్దరు మహావీరుల మధ్య ఆమె పెద్ద రిలీఫ్ అని.. సీత పాత్ర ప్రేక్షకుల మనసులు దోచుకుంటుందని.. రామారాజు - భీమ్ ల మధ్య ఆమె ఒక కనెక్టింగ్ అంశమని రాజమౌళి తండ్రి వెల్లడించారు. మరి RRR సినిమా అమ్మడి కెరీర్ కు ఎలాంటి మార్గం వేస్తుందో చూడాలి.
ఇకపోతే 'RRR' ట్రైలర్ ను సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ తో పాటుగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోని థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ట్రైలర్ తో అంచనాలను రెట్టింపు చేయాలని జక్కన్న ప్లాన్ చేసారని తెలుస్తోంది.
కాగా, 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. 'బాహుబలి' తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న ఈ సినిమాని.. వరల్డ్ వైడ్ గా అత్యధిక స్క్రీన్స్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Full View