ఎన్టీయార్ కర్ణతో ట్రిపుల్ ఆర్ కి పోలికేంటి... ?

Update: 2021-10-26 10:31 GMT
ట్రిపుల్ ఆర్ దర్శక ధీరుడు రాజమౌళి క్రియేషన్. అల్లూరి, కొమరం భీమ్ ల జీవిత కధల స్పూర్తిగా తీస్తున్న సినిమాగా చెప్పుకున్నారు. ఈ మూవీని హిస్టారికల్ కంటెంట్ గా చూడాలేమో. బాహుబలి వంటి జానపద సినిమా తీసిన జక్కన్నకు ట్రిపుల్ ఆర్ చేయడం పెద్ద కష్టం కాదు, పైగా ఇలాంటి సినిమాలు తీయడంతో ఏనాడో ఆరితేరి ఉన్నారు. ఇక జక్కన్న ట్రిపుల్ ఆర్ మీద అంచనాలు అయితే ఈ రోజుకీ సజీవంగానే ఉన్నాయి. పాన్ ఇండియా మూవీస్ అని చాలానే రెడీ అవుతున్నా అవన్నీ కూడా ట్రిపుల్ ఆర్ తరువాతనే అని చెప్పాల్సిందే. ఇక మూడేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత 2022 జనవరిలో ట్రిపుల్ ఆర్ వస్తుంది అంటున్నారు. ఈ రోజు వరకూ అదే ఖాయమనుకుని ఫ్యాన్స్ కూడా సందడి చేస్తున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే ట్రిపుల్ ఆర్ నిడివి విషయం ఇపుడు పెద్ద ఎత్తున చర్చగా ఉంది. ఏకంగా రెండు గంటల నలభై అయిదు నిముషాలు అంటున్నారు. అంటే పావు గంట తక్కువ మూడు గంటల సినిమా అన్న మాట. ఇంత లాంగ్ రన్ తో మూవీ అంటే ఈ మధ్య కాలంలో ఎపుడూ లేదు. నిడివి ఎక్కువ అయిందనే బాహుబలిని రెండుగా విడగొట్టి విడుదల చేశారు. లక్కీగా రెండూ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మరి ట్రిపుల్ ఆర్ విషయంలో రాజమౌళి ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అన్నది చూడాలి. ఒక వేళ రెండు భాగాలు అనుకున్నా కధను ఆ విధంగా డివిజన్ చెసి టూ పార్ట్స్ గా రిలీజ్ చేయడానికి వీలుందా లేదా అన్నది చూడాలి

ఒక వేళ అలా కాదు అనుకుని ఇంత పెద్ద సినిమాను కనుక రిలీజ్ ఒకే పార్ట్ గా రిలీజ్ చేస్తే మాత్రం అది నిజంగా ఈ తరానికి ఒక అద్భుతమే అని కూడా చెప్పాలి. అప్పట్లో అంటే 1977లో రిలీజ్ అయిన ఎన్టీయార్ దాన వీర శూర కర్ణ మూవీ మూడు గంటల దాకా రన్ ఉంది. ఆ మూవీ మొదట తీసింది పాతిక రీళ్ళ దాకా. ఆ తరువాత తగ్గించినా కూడా మూడు గంటలకు వచ్చింది. అయితే నాలుగున్నర దశాబ్దాల క్రితం కాబట్టి ఆ మూవీని చూశారు. ఆ తరువాత 16 రీళ్ళ మూవీ అంటేనే తలనొప్పి అన్న సీన్ ఉంది. ఇక ప్రస్తుతం వస్తున్న మూవీస్ అన్నీ కూడా 14 రీళ్ల దాకానే ఉంటున్నాయి. అంటే గట్టిగా రెండు గంటలు మాత్రమే మూవీ అన్న మాట. ట్రిపుల్ ఆర్ మాత్రం మూడు గంటల మూవీ అంటే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న ఆసక్తి అయితే ఉంది. ఇంటెరెస్ట్ క్రియేట్ చేయాలే కానీ నిడివి పెద్ద సమస్య కాదు అని కూడా అంటారు. రాజమౌళి కధను మంచి బిగితో నడిపిస్తారు కాబట్టి ట్రిపుల్ ఆర్ పూర్తి నిడివి సినిమా అన్న ప్రశ్న తలెత్తకుండా జనాలు చూసేస్తారు అన్న ధీమా అయితే అందరిలో ఉందిట.
Tags:    

Similar News