దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఓ టైటిల్ ని ఎంపిక చేస్తే అది ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో చెప్పాల్సిన పనేలేదు. అందులో యూనివర్శల్ అప్పీల్ తప్పనిసరి. ఆయన ఇమేజ్ కి తగ్గట్టుగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల్లోకి ఆ టైటిల్ వెళ్లాల్సి ఉంటుంది. అయితే అదేమీ లేకుండానే నిన్నటి రోజున దసరా కానుక ఇదిగో అంటూ సింపుల్ గా ఆర్.ఆర్.ఆర్ పీఆర్ టీమ్ నుంచి టైటిల్ ప్రకటన వెలువడింది. ఈ టైటిల్ చూడగానే .. ఏంటి ఇంత సింపుల్ గానా? అంటూ పెదవి విరిచేశారంతా.
`రామ రౌద్ర రుషితం` అంటూ టైటిల్ లోగోని రిలీజ్ చేయడంతో.. అసలు ఇదేనా ఒరిజినల్? అంటూ అందరికీ సందేహం కలిగింది. ఎందుకంటే ఆ టైటిల్ లో అసలు ఏమాత్రం జనాలు మెచ్చే ఎలిమెంట్ లేనే లేదు. పైగా గ్రాంధిక భాషలో టైటిల్ కనిపించడం పెద్ద షాక్ నే ఇచ్చింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రానికి సైతం `సైరా` అంటూ రెండక్షరాల్లో టైటిల్ అద్భుతంగా కుదిరింది. అలాంటిది రాజమౌళి టైటిల్ ఎందుకిలా ఉంటుంది? అంటూ అంతా సందేహం వ్యక్తం చేశారు. కూల్ గా ఆలోచిస్తే అది జక్కన్న టీమ్ పంపించిన అధికారిక టైటిల్ కానే కాదని అర్థమైంది.
అది కేవలం ఫ్యాన్ మేడ్ పోస్టర్ మాత్రమే. టైటిల్ ఇదే ఫైనల్ కాదని తెలిసింది. మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అందరికీ కనెక్టివిటీ ఉండే టైటిల్ ఆర్.ఆర్.ఆర్ కు కుదరాలి. పైగా ఫ్యాన్ మేడ్ టైటిల్ కంటే ఆర్.ఆర్.ఆర్ అన్న టైటిలే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పాలి. ఇది యూనివర్శల్ అప్పీల్ ఉన్నదే. దీనికి పూర్తి టైటిల్ వినిపించినా.. అది ట్యాగ్ లైన్ అవుతుందే కానీ టైటిల్ లా అనిపిస్తుందా? ఇక ఇప్పటికే టైటిల్ కాంటెస్ట్ కూడా జక్కన్న పెట్టారు కాబట్టి దానినుంచి ఎంపిక చేసే టైటిల్ కేవలం తెలుగు ఆడియెన్ సంతృప్తి కోసమే ఎంచుకోవాల్సి ఉంటుందేమో! ఇక తాజాగా ఫ్యాన్ తయారు చేసిన టైటిల్లో అల్లూరి సీతారామరాజులోని రామ ఉంది కానీ కొమరం భీమ్ ని స్ఫురించే పదజాలం ఏదీ లేదు. టైటిల్ పరంగా కేవలం ఒక స్టార్ నే ప్రొజెక్ట్ చేయడం కూడా సరికాదు. అది అభిమానులకు రుచించదు కాబట్టి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్.ఆర్.ఆర్. చిత్రాన్ని 2020 జూలై 30న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ పనిలోనే రాజమౌళి బిజీ. మరి టైటిల్ ని అధికారికంగా ఎప్పటికి ప్రకటిస్తారు అన్నది చూడాలి.