పాన్ ఇండియా చిత్రం 'ఆర్ ఆర్ ఆర్' వార్ స్టిల్ బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎనిమిది రోజుల్లోనే 750 కోట్ల వసూళ్లతో 'బాహుబలి ది బిగినింగ్' వసూళ్లను బ్రేక్ చేసినా 'ఆర్ ఆర్ ఆర్'...అటుపై ఏరియాల వైజ్ గానూ 'బాహుబలి' బిగినింగ్ వసూళ్లను తుడిచిపెట్టేసింది. ఇటీవలే 1000 కోట్ల వసూళ్లను సాధించింది.
దీంతో 'బాహుబలి' ది కనుక్లూజ్ తర్వాత రెండవ స్థానంలో నిలబడింది 'ఆర్ ఆర్ ఆర్'. తెలుగు సినిమాల పరంగా 'ఆర్ ఆర్ ఆర్' అందుకున్న అరుదైన రికార్డు ఇది. ఇండియా టాప్ -5 వసూళ్ల చిత్రాల్లో స్థానం దక్కించుకుంది. ఇండియా వైడ్ మూడవ స్థానంలో 'ఆర్ ఆర్ ఆర్' నిలిచింది. ఇంత పెద్ద సక్సెస్ వెనుక జక్కన్న శ్రమ అనితార సాధ్యమైనదిగా చెప్పొచ్చు.
థియేట్రికలర్ రిలీజ్ కోసం సినిమా ని ట్రిమ్ చేయడం కోసం ఎడిటింగ్ టేబుల్ పై ఎంతో వర్క్ చేసారు. సినిమా క్రిస్పీ నెస్ కోసం వీలైనంత ట్రిమ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇదంత ఈజీ ప్రోసస్ కాదు. ఆన్ సెట్స్ కన్నా ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది. అందుకు ఎంతో ఓపిక ఉండాలి. ఆ విషయంలో రాజమైళి పర్పెక్షన్ కోసం ఎంతగా శ్రమిస్తారో 'బాహుబలి'తోనే అర్ధమైంది. 'ఆర్ ఆర్ ఆర్' విషయంలోనూ అది రుజువు చేసారు.
అయితే ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కోసం రాజమౌళి మరోసారి అదనంగా వర్క్ చేయడానికి రెడీ అవుతున్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. మరికొన్ని నెలలో ఈ సినిమా జీ-5..నెట్ ప్లిక్స్ ద్వారా ఓటీటీ వెర్షన్ రిలీజ్ కానుంది. అయితే ఈ వెర్షన్ రిలీజ్ కోసం జక్కన్న అండ్ కో మరోసారి ఎడిటింగ్ టేబుల్ పై సుదీర్ధంగా వర్క్ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఓటీటీ రిలీజ్ కోసం థియేట్రికల్ రిలీజ్ లో తొలగించిన సన్నివేశాల్ని యాడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారుట.
ఫ్యాన్స్ సైతం ఈ విషయంలో పాజిటివ్ గా ఉండటంతో జక్కన్న ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ రాజమౌళి మళ్లీ అదనంగా శ్రమ ఎందుకు తీసుకుంటారు? సినిమాని ఇప్పటికే ఓటీటీకి అమ్మేసారు? ఇంక ఆయనకి పనేంటి? వంటి సందేహాలు తెరపైకి వస్తున్నాయి. వాటికి ఇంకా సరైన బధులు లేదు గానీ..పని మాత్రం తడిపి మోపుడువుతుంది అన్నది వాస్తవం. ముందుగా ఓటీటీ వెర్షన్ కోసం చక్కటి తుది కట్‌ను ఆర్కెస్ట్రేట్ చేయాలి.
అతని పర్ఫెక్షనిస్ట్ వైఖరి కారణంగా ఇది సుదీర్ఘమైన ప్రక్రియ అవుతుంది. గతంలో ఎప్పుడు ఇలా పనిచేయలేదు. మునపటి ప్రాజెక్ట్ 'బాహుబలి' కోసం ప్రత్యేకమైన OTT కట్‌పై రాజమౌళి ఎలాంటి పని చేయలేదు. థియేట్రికల్ వెర్షన్ ఉన్నది ఉన్నట్లు గా ఓటీటీలో రిలీజ్ చేసారు.
మరి ఇప్పుడు అతను 'RRR' కోసం రంగంలోకి దిగుతున్నారంటే? సదరు ఓటీటీ కార్పోరేట్లతో బిగ్ డీల్ కుదిరే ఉంటుందని ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. 'ఆర్ ఆర్ ఆర్' థియేట్రికల్ లాభాల్లో రాజమౌళి 50 శాతం తీసుకునేలా నిర్మాతలతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఓటీటీతో కూడా అలాంటి డీల్ ఏమైనా సెట్ అయిందా? అన్నది తెలియాలి.