'ఆర్‌ఆర్‌ఆర్‌' పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ అప్‌డేట్‌

Update: 2021-10-22 05:00 GMT
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్.. రామ్‌ చరణ్‌ లు హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా విడుదలకు సిద్దం అవుతోంది. వచ్చే జనవరిలో సినిమాను విడుదల చేసేందుకు అధికారికంగా డేట్‌ ను ఖరారు చేయడం జరిగింది. ఇప్పటికే రెండు మూడు సార్లు డేట్‌ ను మార్చిన కారణంగా జనవరిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సినిమా విడుదల చేసి తీరాలని జక్కన్న భావిస్తున్నాడు. అందుకోసం షూటింగ్‌ ను ఇప్పటికే ముగించాడు. ప్రస్తుతం వీఎఫ్‌ఎక్స్ వర్క్ ను చేయిస్తున్నాడు. ఇప్పటికే సినిమాలో నటించిన నటీనటులు అందరి పాత్రలకు కూడా డబ్బింగ్ పూర్తి అయ్యింది. ఇద్దరు హీరోలు కూడా తమ పాత్రల డబ్బింగ్ ను పూర్తి చేయడం జరిగింది. ఇతర భాషల్లో కూడా డబ్బింగ్ చేప్పించే పనులు జరుగుతున్నాయి.

సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ ముగింపు దశకు చేరుకుంది. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్ పలు దేశాల్లో జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. రాజమౌళి సినిమా అంటే విజువల్ వండర్‌ అన్నట్లుగా ఉంటుంది. బాహుబలి రెండు పార్ట్‌ లు కూడా ఏ రేంజ్ లో ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది గ్రాఫిక్స్ అయ్యి ఉంటుంది అనే థాట్ ఎప్పుడు ఎక్కడ రాకుండా జక్కన్న జాగ్రత్తలు తీసుకుని అద్బుతమైన వీఎఫ్‌ఎక్స్ వర్క్ చేయిస్తూ ఉంటాడు. ఆర్ ఆర్‌ ఆర్ సినిమా కోసం కూడా వీఎఫ్‌ఎక్స్‌ ఎక్స్‌ పర్ట్స్ ను రంగంలోకి దించాడు. సినిమాలో కొన్ని కీలక సన్నివేశాల్లో ఉండే వీఎఫ్‌ఎక్స్‌ పై జక్కన్న ఎక్కువ శ్రద పెడుతున్నాడట. ముఖ్యంగా ఎన్టీఆర్‌ ఒక ఫైట్ సన్నివేశంలో నభూతో అన్నట్లుగా ప్లాన్ చేశాడట.

మొత్తంగా జక్కన్న వీఎఫ్‌ఎక్స్ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా టైమ్‌ కు పూర్తి చేసేలా ప్లాన్‌ చేశాడు. సినిమా ఫస్ట్‌ కాపీ డిసెంబర్‌ రెండవ వారంకు రెడీ అయ్యేలా టార్గెట్‌ పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ నుండి సినిమా ప్రమోషనల్‌ కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నారు. కేవలం పాన్ ఇండియా సినిమాగా కాకుండా ఈ సినిమాను విదేశీ భాషల్లో కూడా డబ్‌ చేయాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా మరో వైపు జరుగుతున్నాయి. అల్లూరి సీతారామరాజు మరియు కొమురం భీమ్‌ ల కల్పిత కథే ఈ 'రౌద్రం రణం రుధిరం'. బాలీవుడ్‌ స్టార్‌ ఆలియా భట్ హీరోయిన్ ఆ నటించిన ఈ సినిమా లో మరో బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవగన్ కీలక పాత్రలో నటించాడు. శ్రియ మరియు ఇంకా ప్రముఖ నటీ నటులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు.
Tags:    

Similar News