ఐశ్వర్యారాయ్ ఆరోగ్యంపై షాకింగ్ న్యూస్!
ఐశ్యర్యారాయ్ అభిమానులు షాక్ కి గురయ్యే వార్త అనే చెప్పాలి.
ఐశ్వర్యారాయ్ అందంలో ఇప్పుడెన్నో మార్పులొచ్చాయి. ఆమెలో విశ్వసుందరి బ్యూటీ ఏమైందని నిరంతరం నెట్టింట చర్చ నడుస్తూనే ఉంటుంది. ఉన్నట్లుండి ఆమె శరీరంలో ఎందుకన్ని మార్పు లొచ్చాయి? ముఖంలో ఆ మార్పులేంటని ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. కానీ వీటికి సరైన సమాధానం మాత్రం లేదు. వయసుతో పాటు వచ్చిన మార్పులుగానే అంగీకరించాల్సి వచ్చింది.
అయితే తాజాగా నెట్టింట ఓ వార్త వైరల్ అవుతుంది. ఇందులో నిజమెంతో తెలియదు గానీ ఐశ్యర్యారాయ్ అభిమానులు షాక్ కి గురయ్యే వార్త అనే చెప్పాలి. ఐష్ ఓ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్టు ఓ న్యూస్ బయటికి వచ్చింది. అది కాస్తా ఇప్పుడు అందర్నీ షాక్ కు గురిచేస్తోంది. ఐష్ పై వస్తున్న ట్రోల్స్ నేపథ్యంలో ఓ యాప్ లో షాకింగ్ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. ఇందులో ఐశ్వర్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. ఆమె ఓ ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడుతన్నారని రిపోర్ట్ వైరల్ అవుతోంది.
ఆ వ్యాధి కారణంగానే ఐశ్వర్యారాయ్ ముఖం అలా అయిందని ఆ రిపోర్టులో ఉంది. కొంత కాలంగా ఆమె సరిగ్గా తిండి తినడం లేదని, అయినా సరే బరువు పెరుగుతోందని , మందులు వాడుతున్నప్పటకీ సరైన ఫలితం ఉండటం లేదనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీన్ని ఓ తప్పుడు ప్రచారంగా కొంతమంది కొట్టిపారేసారు.
నిన్నటి వరకూ ఐఫా వేడుకల్లో కనిపించిన ఐశ్వర్యారాయ్ కి అనారోగ్యం ఏంటి? ఇవన్నీ తప్పుడు కథనాలన్ని ఖండిస్తున్నారు. 1973 నవంబరు ఒకటోతేదీన జన్మించిన ఐశ్వర్యారయ్ కి ఇప్పుడు 50 సంవత్సరాలు. అలాంటి ఐశ్వర్యారాయ్ ని ఇప్పటికీ 30 ఏళ్ల బ్యూటీలా చూడటం అంటే ఎలా సాధ్యపడుతుంది? చూపరుల ఆశకు కూడా ఓహద్దు ఉండాలి అంటూ ఓ యూజర్ పోస్ట్ చేసాడు.