దేవర బాక్సాఫీస్.. దూసుకుపోతోందిగా!
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. సోలోగా ఆరేళ్ల తర్వాత దేవర పార్ట్-1తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. సోలోగా ఆరేళ్ల తర్వాత దేవర పార్ట్-1తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆ మూవీ.. సెప్టెంబర్ 27వ తేదీన గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్.. యాక్టర్ సైఫ్ అలీ ఖాన్.. దేవరతోనే టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన దేవర మూవీ.. థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకుని దూసుకుపోతోంది.
అదే సమయంలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. భారీ కలెక్షన్స్ సాధిస్తోంది. రూ.172 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన దేవర.. రెండో రోజు రూ.71 కోట్లు వసూళ్లు సాధించింది. తాజాగా రూ.300 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అదిరిపోయే పోస్టర్ తో మేకర్స్ ఆ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మూడో రోజు వరల్డ్ వైడ్ గా రూ.61 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. తారక్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న మూవీ(సోలో) దేవరనే కావడం విశేషం!
అయితే దేవర ఫస్ట్ వీకెండ్ లో అదరగొట్టేసిందనే చెప్పాలి. టాలీవుడ్ సినిమాల్లో ఫస్ట్ వీకెండ్ కు మంచి వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. తెలుగు రాష్ట్రాలతోపాటు బాలీవుడ్ లో కూడా దేవర మంచి వసూళ్లను రాబడుతోంది. ఓవర్సీస్ లో వీకెండ్ వరకు మొత్తం ఏడు మిలియన్ల డాలర్లు వసూలు చేసింది. అందులో ఎక్కువ భాగం ప్రీమియర్స్ తో పాటు తొలి రోజు వచ్చాయి. అలా దేవర పార్ట్-1 బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాలు సాధించడం పక్కా.
సోమవారం వీక్ డే కాబట్టి కాస్త వసూళ్లు తగ్గినా.. మంగళవారం గాంధీ జయంతి పబ్లిక్ హాలిడే కనుక మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత రోజు నుంచి విద్యార్థులకు దసరా సెలవులు మొదలు కానున్నాయి. 14వ తేదీ వరకు సెలవులు ఉన్నాయి. కాబట్టి దేవరకు ఎలాంటి ఢోకా లేదని.. బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ రూ.300 కోట్లకు పైగా బడ్జెట్ తో దేవర మూవీని నిర్మించారని సమాచారం. దాదాపు సూపర్ హిట్ స్టేటస్ కోసం దేవర రూ.400 కోట్ల వసూలు చేయాలట. దీంతో మరికొద్ది రోజుల్లో బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుని దేవర లాభాల బాటలోకి వెళ్తుందని అంతా భావిస్తున్నారు. మరి దేవర మూవీ.. ఫుల్ థియేట్రికల్ రన్ లో ఎంత వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి.