ఇండస్ట్రీ కి రావాలని ఎప్పుడూ అనుకోలేదు! హను రాఘవపూడి
రైటింగ్ అంటే ఆసక్తి ఉంది. కాబట్టి పరిశ్రమకు రావాలనుకున్నా.
సినిమాల్లో రాణించాలంటే ఏదో విభాగంలో ఫ్యాషన్ ఉండాలి. నటన..సంగీతం..రచన...కెమెరా...విజువల్స్ ఇలా ఏదో ఒక విభాగంలో మంచి పట్టు ఉండాలి. దాంతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. ఎంత ట్యాలెంట్ ఉన్నా? ఆవగింజంత అదృష్టం లేకపోతే అవకాశం రాదన్నది అందరికీ తెలిసిన వాస్తమే. అలా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన హను రాఘవపూడి నేడు ఏ స్థాయిలో ఉన్నాడో చెప్పాల్సిన పనిలేదు.
`అందాల రాక్షసి`తో దర్శకుడిగా పరిచయమైన హనుకు మరో హిట్ `సీతారామం`తో దక్కింది. ఆ విజయం అతడి లైప్ నే మార్చేసింది. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో `పౌజీ` చేస్తున్నాడు. ఇది హిట్ అయితే అతడి స్థాయి అంతకంతకు రెట్టింపు అవుతుంది. ఈనేపథ్యంలో హను ఇండస్ట్రీకి ఎలా వచ్చాడో? అతడి మాటల్లోనే.. `మా ఇంట్లో సినిమాలంటే ఒప్పుకోరు. చూడనివ్వరు . వాళ్లకు చెప్పి చూసిన సినిమా `స్వాతి కిరణం.`
అది చూసి ఆశ్చర్యపోయా. అప్పటి నుంచి విశ్వనాధ్ గారి సినిమాలు చూడటం మొదలుపెట్టాను. అవి చూసాక సాహిత్యంపై ఆసక్తి మొదలైంది. భాష మీద పట్టుకోసం పుస్తకాలు చదివాను. ఇండస్ట్రీకి వస్తానని కలలో కూడా అనుకోలేదు. ఆ ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు. పీజీ చదివే సమయంలో చదువు అవ్వగానే ఉద్యోగం చేయాలేమో ! అది నా వల్ల కాదనిపించింది.
రైటింగ్ అంటే ఆసక్తి ఉంది. కాబట్టి పరిశ్రమకు రావాలనుకున్నా. అలా `అమృతం` సీరియల్ కి పని చేయడానికి సెట్ అయ్యాను. ఆ తర్వాత `ఐతే` సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసా` అన్నారు.