2022 జ‌న‌వ‌రికి సంపూర్ణ వ్యాక్సినేష‌న్.. స‌మ్మ‌ర్ లో #RRR?

Update: 2021-04-30 04:30 GMT
అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లానే వినోద‌ప‌రిశ్ర‌మ‌కు గ‌డ్డు కాల‌మిది. ఏడాది కాలంగా కొన‌సాగుతున్న మ‌హ‌మ్మారీ వైప‌రీత్యం ఇంకా కొంత‌కాలం ఇబ్బంది పెట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం సెకండ్ వేవ్ ఉధృతి కొన‌సాగుతోంది. దీని ప‌ర్య‌వ‌సానం రెగ్యులర్ చిత్రాల కంటే పాన్ ఇండియా సినిమాల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.

బ‌హుభాష‌ల్లో దేశ విదేశాల్లో అత్యంత భారీగా రిలీజ్ చేయాల్సిన సినిమాల రిలీజ్ తేదీల విష‌యంలో ఎన్న‌డూ లేనంత‌గా సందిగ్ధ‌త నెల‌కొంది. పాన్ ఇండియా కేట‌గిరీలో ఆర్.ఆర్.ఆర్ ఏకంగా 10-12 భాష‌ల్లో రిలీజ్ కావాల్సి ఉండ‌గా ఈ సినిమా రిలీజ్ తేదీపై ఇప్ప‌టికీ స్ప‌ష్ఠ‌త లేదు.

ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ లో రిలీజ‌వుతుంద‌ని రాజ‌మౌళి టీమ్ ఇంత‌కుముందు ప్ర‌క‌టించింది. నిజానికి ఈ సినిమా 2020 సమ్మ‌ర్ కి రావాల్సిన‌ది. కానీ ఆ త‌ర‌వాత 2021 సంక్రాంతికి లేదా స‌మ్మ‌ర్ కి వస్తుంద‌ని అన్నారు. కానీ అది కూడా వాయిదా ప‌డి 2021 అక్టోబ‌ర్ 13న రిలీజ్ చేస్తున్నామ‌ని జ‌క్క‌న్న టీమ్ ప్ర‌క‌టించింది. కానీ ఇప్పుడు సెకండ్ వేవ్ వ‌ల్ల మ‌రోసారి ఈ సినిమా రిలీజ్ తేదీ వాయిదా వేస్తున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఒక‌వేళ వాయిదా ప‌డితే 2022 సంక్రాంతి లేదా వేస‌వికి రిలీజ‌య్యే ఆస్కారం ఉంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఇప్ప‌టికే జ‌క్క‌న్న 2022 సంక్రాంతిపై దృష్టి సారిస్తారేమోన‌ని ప‌లువురు ఇత‌ర నిర్మాత‌లు త‌మ సినిమాల రిలీజ్ తేదీల్ని ఒక నెల అడ్వాన్స్ డ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతానికి ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఇది గుస‌గుస మాత్ర‌మే. త‌మ సినిమా రిలీజ్ తేదీ మారింది అని రాజ‌మౌళి టీమ్ ప్ర‌క‌టించాల్సి ఉంది. ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా చిత్రం స‌జావుగా రిలీజ్ కావాలంటే దేశంలోనే కాదు అమెరికా విదేశాల్లోనూ క‌రోనా అంతం కావాల్సి ఉంది. అన్నిచోట్లా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగంగా పూర్త‌యినా జ‌న‌వ‌రి 2022 నాటికి కానీ అది సాధ్యం కాద‌ని తెలుస్తోంది. అంటే ఈ సినిమాని 2022 సమ్మ‌ర్ నాటికి కాన్ఫిడెంట్ గా తెచ్చేందుకు వెసులుబాటు ఉంటుంద‌ని  కూడా విశ్లేషిస్తున్నారు.

మ‌రో రెండు నెల‌ల్లో సినీప‌రిశ్ర‌మ కార్మికుల్లో అలాగే మెజారిటీ ప్ర‌జ‌ల‌కు వ్యాక్సినేషన్ పూర్త‌యితే షూటింగుల‌కు ఇబ్బంది ఉండ‌క‌పోవ‌చ్చ‌న్న అంచ‌నా ఉంది. ఆర్.ఆర్.ఆర్ స‌హా చాలా పెద్ద సినిమాల‌కు ప‌ని చేసే యూనిట్ స‌భ్యులకు వ్యాక్సినేష‌న్ వ‌గైరా పూర్తి చేసేందుకు క‌ట్టుదిట్టమైన ప్ర‌ణాళిక‌లు అమ‌లు చేస్తున్నార‌ని తెలిసింది.
Tags:    

Similar News