జ‌క్క‌న్న చెబుతుంది నాన్నా పులి క‌థేనా?

Update: 2022-11-15 02:30 GMT
నాన్నా పులి క‌థ గురించి అంద‌రికి తెలిసే వుంటుంది. `పులి` రాకున్నా స‌రే పులి వచ్చేసిందంటూ తండ్రిని త‌న‌యుడు ఆట‌ప‌ట్టించ‌డం.. ఆ త‌రువాత నిజంగానే పులి రాడ‌వం.. పులి వ‌చ్చింద‌ని చెప్పినా తండ్రి ప‌ట్టించుకునే స్థితిలో లేక‌పోవ‌డం.. ఇది మ‌న చిన్న‌త‌నంలో విన్న క‌థ‌. కానీ ఇదే క‌థ‌ని రాజ‌మౌళి ప‌దే ప‌దే చెబుతుండ‌టం విచిత్రం, విడ్డూరంగానే వుంనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. వివ‌రాల్లోకి వెలితే..రాజ‌మౌళి తెర‌కెక్కించిన పాన్ ఇండియా వండ‌ర్ `బాహుబ‌లి`. ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో స‌రికొత్త అధ్యాయానికి ఈ మూవీ శ్రీ‌కారం చుట్టి స‌మూలంగా ఇండియ‌న్ సినిమానే మార్చేసింది. ఇక టాలీవుడ్ ద‌శ‌ని, దిశ‌ని స‌మూలంగా మార్చేసి తెలుగు సినిమా అంటే యావ‌త్ ఇండియా ఆస‌క్తిగా ఎదురుచూసేలా చేసింది. ఈ సినిమా నుంచి రెండు సిరీస్ లు విడుద‌లైన విష‌యం తెలిసిందే. మూడ‌వ భాగాన్ని కూడా చేస్తామంటూ అప్ప‌ట్లో రాజ‌మౌళి ప్ర‌క‌టించ‌డంతో `బాహుబ‌లి` ల‌వ‌ర్స్ ఈ మూవీపై అంచ‌నాలు పెట్టుకున్నారు.

కానీ అది ర‌గ‌లేదు. ప్రీక్వెల్ కు అవ‌కాశాలు వున్నా రాజ‌మౌళి దాని గురించి మ‌ళ్లీ ఎక్క‌డా ప్ర‌స్థావించ‌లేదు. నెట్ ఫ్లిక్స్ వారు టాలీవుడ్ డైరెక్ట‌ర్ల‌తో `ది రైజ్ ఆఫ్‌ శివ‌గామి` అంటూ వెబ్ సిరీస్ ని మొద‌లు పెట్టి మ‌ధ్య‌లోనే ఆపేశారు. దేవా క‌ట్టాతో పాటు మ‌రి కొంత మంది ద‌ర్శ‌కుల‌తో ప్ర‌య‌త్నాలు చేసి ఫైన‌ల్ గా ప‌క్క‌న పెట్టేశారు. దీంతో ఇక `బాహుబ‌లి` సీక్వెల్ రావ‌డం క‌ష్ట‌మ‌ని అభిమానుల‌కు క్లారిటీ వ‌చ్చేసింది. ఇదిలా వుంటే రీసెంట్ గా `RRR`తో పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ ని సొంతం చేసుకున్నారు రాజ‌మౌళి.

ఈ మూవీని ఇటీవ‌లే జ‌పాన్ లోనూ భారీ స్థాయిలో విడుద‌ల చేశారు. ప్ర‌మోష‌న్స్ కోసం రాజ‌మౌళి, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ వెళ్లి ప్ర‌మోష‌న్స్ కూడా చేశారు. త్వ‌ర‌లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు తో భారీ పాన్ ఇండియా మూవీకి రెడీ అవుతున్న రాజ‌మౌళి రీసెంట్ గా `RRR` కి సీక్వెల్ వుంటుంద‌ని స్టేట్ మెంట్ ఇవ్వ‌డం ప‌బ్లిసిటీ స్టంట్ గా అభివ‌ర్ణిస్తున్నారు. `RRR` సీక్వెల్ కోసం తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ సిద్ధం చేస్తున్నార‌ని చెప్ప‌డం న‌మ్మ‌శ‌క్యంగా లేద‌ని కామెంట్ లు వినిపిస్తున్నాయి.

రాజ‌మౌళి ఈ సారి కూడా నాన్నా పులి క‌థే చెబుతున్నార‌ని, మ‌ళ్లీ రాజ‌మౌళి, ఎన్టీఆర్ మూడున్న‌రేళ్ల పాటు డేట్స్ ఇవ్వ‌డం క‌ష్ట‌మ‌ని చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇప్ప‌ట్లో కార్య‌రూపం దాల్చ‌డం క‌ష్మ‌ని తెలిసి కూడా రాజ‌మౌళి ఎందుకిలాంటి స్టేట్ మెంట్ లు ఇస్తున్నార‌ని, ఆస్కార్ బ‌రిలో ఈ మూవీని నిల‌పాల‌న్న ఆలోచ‌న‌లో భాగంగానే ఈ మూవీని నెట్టింట వైర‌ల్ చేయాల‌న్న ప్లాన్ లో భాగంగానే రాజ‌మౌళి సీక్వెల్ అంటూ నాన్నా పులి క‌థ చెబుతున్నార‌ని సినీ ల‌వ‌ర్స్ పెదవి విరుస్తున్నార‌ట‌.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News