దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ''ఆర్.ఆర్.ఆర్''. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనికి తగ్గట్టుగానే ట్రిపుల్ ఆర్ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. ఇండియాలోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు మ్యూజిక్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్మడుపోయినట్లు తెలుస్తోంది. తాజాగా 'ఆర్ ఆర్ ఆర్' ఆడియో హక్కులకు సంబంధించి మేకర్స్ అధికారిక పోస్టర్ విడుదల చేశారు.
మోస్ట్ అవైటెడ్ మూవీ RRR ఆడియో రైట్స్ భూషణ్ కుమార్ కు చెందిన టీ-సిరీస్ మరియు లహరి మ్యూజిక్ సంస్థలు దక్కించుకున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. హిందీతో పాటుగా దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మ్యూజిక్ రైట్స్ సొంతం చేసుకున్నారని పోస్టర్ లో పేర్కొన్నారు. ''రాజమౌళి రూపొందిస్తున్న భారతదేశపు అతిపెద్ద యాక్షన్ డ్రామా 'RRR' మ్యూజిక్ రైట్స్ పొందడం ఆనందంగా ఉంది'' అని టీ-సిరీస్ మరియు లహరి మ్యూజిక్ సంస్థలు తెలిపాయి.
ఈ సందర్భంగా భూషణ్ కుమార్ మాట్లాడుతూ ''మాకు రాజమౌళి - కీరవాణి కాంబినేషన్ అంటే ఎంతో ఇష్టం. వారి వర్క్ ని మేము ఎల్లప్పుడూ గౌరవిస్తాం. దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘RRR’ సినిమా మ్యూజిక్ రైట్స్ దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉంది. పాటలు మరియు సినిమా అందరికీ నచ్చుతాయని ఆశిస్తున్నాము'' అని అన్నారు. కాగా, 'ఆర్ ఆర్ ఆర్' సినిమా అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ పాత్రల ఆధారంగా కల్పిత కథతో తెరకెక్కుతోంది.
ఇందులో ఎన్టీఆర్ - రామ్ చరణ్ ల సరసన ఒలివియా మోరిస్ - ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ - శ్రియ - సముద్రఖని తో పాటుగా పలువురు హాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. రెండు పాటలు మినహా చిత్రీకరణ మొత్తం పూర్తి అయింది. ఈ సినిమా కోసం యావత్ సినీ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.