న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ లో RRR స్పెష‌ల్ ట్రీట్!

Update: 2021-12-31 14:30 GMT
పాన్ ఇండియా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` ప్రీ రిలీజ్ ఈవెంట్ల‌ను మెట్రో పాలిట‌న్ న‌గ‌రాల్లో పెద్ద ఎత్తున నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ముంబై..చెన్నై సిటీస్ లో పెద్ద ఎత్తున ఈవెంట్లు జ‌రిపారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌..యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్..ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి... చిత్ర నిర్మాత దాన‌య్య త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ముంబై ఈవెంట్ కి బాలీవుడ్ ప్ర‌ముఖులు విచ్చేయ‌గా..చెన్నై ఈవెంట్ కి కోలీవుడ్ ప్ర‌ముఖులు విచ్చేసారు. ఇంకెన్ని చోట్ల ఇలాంటి ఈవెంట్లు ప్లాన్ చేసారా? అన్న‌ది తెలియాల్సి ఉంది. అయితే తిరుప‌తి లో భారీ ఈవెంట్ నిర్వ‌హించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ముందుగా `బాహుబ‌లి` `ది గిబిగినింగ్`  ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అక్క‌డే నిర్వ‌హించారు. ఆ సెంటిమెంట్ గానే `ఆర్ ఆర్ ఆర్` తెలుగు వెర్ష‌న్ ప్రీ రిలీజ్ అక్క‌డే ప్లాన్ చేస్తున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే మ‌రికొన్ని గంట‌ల్లోనే కొత్త ఏడాదిలోకి అడుగు పెట్ట‌బోతున్నాం.  ఇప్ప‌టికే కౌంట్ డౌన్ మొద‌లైపోయింది. సెల‌బ్రిటీలంతా వేడుక‌ల్లో బిజీ అయ్యారు. ఈ నేప‌థ్యంలో రోర్ ఆఫ్ ఆర్ ఆర్ ఆర్ ముంబై ఈవెంట్ ని ఈరోజు రాత్రి 11 గంట‌ల‌కు  జీటీవీ..జీ సినిమాస్ లో టెలికాస్ట్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా `ఆర్ ఆర్ ఆర్` ప్ర‌మోష‌న్ టీమ్ చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్ ఒక‌ర్ని ఒక‌రు హ‌త్తుకుని ఉన్న ముంబై ఈవెంట్ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసారు. ఆ ప‌క్క‌నే  రాజ‌మౌళి..శ్రియ కూడా స్టేజ్ పై ఉన్నారు.

ఈ రాత్రికి ఈవెంట్ ప్ర‌సారం అయితే చాలా మంది చూసే అవ‌కాశం ఉంది. అంద‌రూ  న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లో బిజీ అవుతారు. రాత్రంతా పార్టీలంటూ హ‌డావుడి ఉంటుంది. ఆ ఎంజాయ్ మెంట్ లో `ఆర్ ఆర్ ఆర్` ఈవెంట్ పై..సినిమాపై డిస్క‌ష‌న్స్  జుగుతాయి. అందుకే టీమ్ ఇలా ప్లాన్ చేసిన‌ట్లు ఉంది.  ఇదంతా జ‌క్క‌న్న ఐడియానే అవుతుంది. సినిమా ప్రారంభం ద‌గ్గ‌ర నుంచి రిలీజ్ వ‌ర‌కూ ఆయ‌న ఆధ్వ‌ర్యంలోనే అన్ని జ‌రుగుతాయి. అదీ ప్ర‌చారం విష‌యంలో జ‌క్క‌న్న స్ర్టాట‌జీ అంద‌రికంటే  భిన్నంగా ఉంటుంద‌న్న‌ది తెలిసిందే. 
Tags:    

Similar News