అక్క‌డ కూడా వాయిస్ వినిపించేస్తార‌ట‌

Update: 2021-12-30 08:30 GMT
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలిసారి క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ పాన్ ఇండియా మూవీ `ఆర్ ఆర్ ఆర్‌`. జ‌క్క‌న్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ చిత్రంపై వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ అంచనాలు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. భారీ తార‌గ‌ణం, అబ్బుర ప‌రిచే ఇద్ద‌రు స్టార్ ల విన్యాసాలు, ప్రీ ఇండిపెండెట్ టైమ్ లోని ఇద్ద‌రు రియ‌ల్ హీరోల పాత్ర‌ల్లో చిరుత పులుల్లా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ చ‌ల‌రేగి న‌టించిన తీరు సినిమాపై ఊహ‌కంద‌ని అంచ‌నాల్ని సెట్ చేసింది.

ఇందులో ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమురం భీం పాత్ర‌లోనూ.. రామ్ చ‌ర‌ణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు గానూ క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే. అలియాభ‌ట్ సీత గానూ, ఒలివియా మోరీస్.. ఎన్టీఆర్ కు జోడీగా నూ క‌నిపించ‌బోతుండ‌గా ఈ ఇద్ద‌రు వీరుల‌కు గురువుగా బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్ న‌టించారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ చిత్ర ట్రైల‌ర్ సినిమా ఏ రేంజ్ లో వుండ‌బోతుందో హింట్ ఇచ్చేసింది.  

ఇదిలా వుంటే ఈ చిత్ర ప్ర‌చారం కోసం బాలీవుడ్ లో వారం పాటు పాగా వేసి ఉత్త‌రాది ప్రేక్ష‌కులే ప్ర‌ధాన టార్గెట్ గా భావించిన ఈ చిత్ర యూనిట్ అక్క‌డ సినిమాని భారీ స్థాయిలోనే ప్ర‌చారం చేసింది. అంతే కాకుండా ఉత్త‌రాది ప్రేక్ష‌కుల్ని మ‌రింత‌గా ఆక‌ట్టుకునే క్ర‌మంలో ఈ సినిమాలోని పాత్ర‌ల‌కు ఎన్టీఆర్ , రామ్ చ‌ర‌ణ్ హిందీ వెర్ష‌న్ కి స్వ‌యంగా డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డం విశేషం. ట్రైల‌ర్ లో ఇప్ప‌టికే హిందీ ప‌దాల‌తో త‌మ వాయిస్ ని ఇద్ద‌రు హీరోలు వినిపించారు.

ఈ విష‌యాన్ని తాజాగా హీరోయిన్ అలియా భ‌ట్ వెల్ల‌డించింది. అంతే కాకుండా ఈ మూవీ ట్రైల‌ర్ ని మీరు ఖ‌చ్చితంగా విని వుంటే ఈ ఇద్ద‌రు సినిమా మొత్తం డ‌బ్బింగ్ చెప్పార‌ని గ్ర‌హించేవారు. హిందీ ప్రేక్ష‌కులకు ఈ సినిమా స‌రికొత్త అనుభూతినిస్తుంది` అని అలియా భ‌ట్ స్ప‌ష్టం చేసింది.  ఇటీవ‌ల ఈ చిత్ర ప్ర‌చారంలో భాగంగా క‌పిల్ శ‌ర్మ షోలో రాజ‌మౌళి, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్, అలియా భ‌ట్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అర్చ‌న పూర‌ణ్ సింగ్ అడిగిన ప్ర‌శ్న‌కు అలియా పై విధంగా స‌మాధానం చెప్ప‌డం విశేషం.

ఆ త‌రువాత చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ల‌కు హిందీలో త‌మ‌కున్న ప‌ట్టు గురించి, అలాగే వారు దాన్ని ఎలా నేర్చుకోగ‌లిగార‌ని ప్ర‌శ్నించింది. దీనికి ఎన్టీఆర్ ఆన్స‌ర్ ఇచ్చారు. హైద‌రాబాద్ హిందీ ఎక్కువ‌గా మాట్లాడే న‌గ‌రం. అలాగే పాఠ‌శాల విద్య స‌మ‌యంలో నా మొద‌టి భాష హిందీ. ఎందుకంటే నేను ఈ భాష‌ను నేర్చుకోవాల‌ని మా అమ్మ కోరింది` అని చెప్పారు ఎన్టీఆర్‌. అంతే కాకుండా ఇది మ‌న భార‌తీయ భాష‌. ఈ సంద‌ర్భంగా నాకు స‌హాయంగా నిలిచింది. నాకు ముంబై లో  కొంత మంది స్నేహితులున్నారు. సాంకేతిక నిపుణులు హైద‌రాబాద్ వ‌స్తుంటారు.

ఇలా ఇక్క‌డి వారు అక్క‌డికి అక్క‌డి వారు ఇక్క‌డికి వ‌స్తూ పోతూనే వుంటారు. మాతో క‌లిసి ప‌ని చేస్తూనే వుంటారు. ఈ సంద‌ర్భంగా `బాహుబ‌లి`కి ధ‌న్య‌వాదాలు చెప్పాల్సిందే. ఈ సినిమా త‌రువాత ఈ ప్ర‌క్రియ మ‌రింత బాగా పెరిగింది. ఏ భాష‌లో అయినా మాట్లాడాల‌నుకున్న‌ప్పుడు నిదానంగా మాట్లాడుతూ నేర్చుకుంటూ వుంటే అదే వ‌చ్చేస్తుంది` అని తెలిపారు ఎన్టీఆర్‌. ఎన్టీఆర్ ఆస‌క్తిక‌ర స‌మాధానాలు చెప్పిన `ది క‌పిల్ శ‌ర్మ` షో సోనీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ టెలివిజ‌న్ లో ప్ర‌సారం కానుంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన `ఆర్ ఆర్ ఆర్‌` జ‌న‌వ‌రి 7న సంక్రాంతి కానుక‌గా 14 భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి.  
Tags:    

Similar News