'శ‌క్తిమాన్‌'గా ఆ స్టార్ హీరో స‌రిపోడు

తాజా ఇంట‌ర్వ్యూలో మ‌రోసారి స‌ద‌రు పెద్ద హీరో ఆ యువ‌హీరో ప్ర‌య‌త్నం గురించి రివీల్ చేసారు.

Update: 2024-10-01 03:00 GMT

ప్ర‌ముఖ‌ హీరో శ‌క్తిమాన్ పాత్ర‌లో న‌టించేందుకు ఆస‌క్తిగా ఉన్నార‌ని ఏడాది కాలంగా క‌థ‌నాలొస్తున్నాయి. అయితే అత‌డు ఆ పాత్ర‌కు సూట్ కాడ‌ని మాతృక‌లో న‌టించిన పెద్ద స్టార్ నిరాశ‌ప‌ర‌చ‌డంతో అది ఇంకా హోల్డ్ లోనే ఉన్న‌ట్టు తెలుస్తోంది. తాజా ఇంట‌ర్వ్యూలో మ‌రోసారి స‌ద‌రు పెద్ద హీరో ఆ యువ‌హీరో ప్ర‌య‌త్నం గురించి రివీల్ చేసారు. త‌న‌తో సంభాష‌ణ‌ల గురించి వివ‌రించాడు.


ఈ ఎపిసోడ్ లో శ‌క్తిమాన్ పాత్ర‌లో న‌టించేందుకు ఆస‌క్తి చూపించిన హీరో మ‌రెవ‌రో కాదు.. ర‌ణ‌వీర్. కానీ అత‌డు స‌రిపోడ‌ని శ‌క్తిమాన్ మాతృక క‌థానాయ‌కుడు, సీనియ‌ర్ న‌టుడు ముఖేష్ ఖ‌న్నా అన్నారు. ముఖేష్ తో చ‌ర్చించేందుకు రణ్‌వీర్ సింగ్ వెళ్లారు... సంభాషించారు. కానీ ఆ పాత్ర‌కు స‌రిపోరు అని నిర్మొహ‌మాటంగా అత‌డు చెప్పాడు. ఇప్పుడు అత‌డు ఎందుకు సరిపోడు? అని ప్ర‌శ్నించ‌గా ముఖేష్ మ‌రోసారి స్పందించారు.

నేను ఏ నటుడినీ విమర్శించాల్సిన అవసరం లేదు కాబట్టి నేను పేర్లు చెప్ప‌ను అంటూనే అత‌డు చెప్పాల్సిన‌దంతా చెప్పారు. మనస్తాపం చెందుతారు కానీ అంటూనే.. రణవీర్ సింగ్ నన్ను ఒప్పించడానికే వచ్చాడని చెప్పారు. నేను అతడిని 'టెర్రిఫిక్ యాక్టర్' అని అన్నాను.. అత‌డి ఎనర్జీని మెచ్చుకున్నాను.

అదే స‌మ‌యంలో శక్తిమాన్ పాత్రలో రణవీర్‌ను ఖరారు చేసినట్లుగా సోషల్ మీడియాలలో ఫోటోలను పోస్ట్ చేయడం ప్రారంభించారు. నేను సోనీతో ఒప్పందం చేసుకున్నందున దీనిపై ఇంకా స్ప‌ష్ఠ‌త లేదు. నేను ఒక వీడియోను పోస్ట్ చేసాను.. అందులో నేను క‌థానాయ‌కుడి గురించి ఏమీ చెప్పలేదు కాబట్టి దయచేసి కొంత సమయం వేచి ఉండండి.. అని అడిగాను. ఆ యువ‌కుడు (రణవీర్ సింగ్) నా ముందు మూడు గంటలు కూర్చున్నాడు. ఒప్పించే ప్ర‌య‌త్నం చేసాడు. కానీ శక్తిమాన్ గా ఏమి అవసరమో అది అతడి ముఖంలో ప్రతిబింబించదు. అతడు ఎవరినైనా మోసం చేస్తానన్నట్లుగా చంచలంగా కనిపిస్తాడు. కానీ అతడు అద్భుతమైన నటుడు. అత‌డికి ఉన్న‌ ఎనర్జీ సినిమా ఇండస్ట్రీలో మరెవరికీ లేదని చెప్పాను. కానీ నేను అతడిని ఆ పాత్రకు ఆమోదించలేదు... అని తెలిపారు.

అలాగే ర‌ణ‌వీర్ నగ్న ఫోటోషూట్ గురించి ముఖేష్ మాట్లాడారు. ఆ ఫోటోషూట్ (డర్టీ మ్యాగజైన్‌తో చేసిన న్యూడ్ షూట్) అతడిపై నాకు విరక్తి కలగ‌డానికి చాలా పెద్ద కారణాలలో ఒకటి. నేను ఆ ఫోటోషూట్ చూసినప్పుడు ..క్యా కర్ రహా హై యార్ (ఏం చేస్తున్నావు) అన్నాను.

రణ్‌వీర్ సింగ్ చివరిసారిగా రోహిత్ శెట్టి 'సర్కస్‌'లో కనిపించాడు. అతడు తదుపరి 'సింగమ్ ఎగైన్‌'లో కనిపిస్తాడు. ఇందులో అజయ్ దేవగన్ టైటిల్ రోల్‌లో నటించాడు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, కరీనా కపూర్, అర్జున్ కపూర్, జాకీ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags:    

Similar News