దేవర బాక్సాఫీస్... 4వ రోజు కూడా అదే జోరు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’ ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 300+ కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది.

Update: 2024-10-01 04:53 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’ ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 300+ కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది. ఎన్టీఆర్ కెరియర్ లోనే సోలోగా హైయెస్ట్ కలెక్షన్స్ దిశగా ఈ మూవీ దూసుకుపోతుంది. మొదటి వారం పూర్తయ్యేనాటికి 500 కోట్ల మార్క్ ని ఈ చిత్రం అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సినిమాకి అద్భుతమైన ఆదరణ వస్తోందని మేకర్స్ రెగ్యులర్ గా కలెక్షన్స్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు.

వీకెండ్ మూడు రోజులు భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టిన ‘దేవర’ మూవీ వీక్ డేస్ లో కూడా డీసెంట్ వసూళ్లు అందుకుంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చి సినిమాని చూస్తున్నారు. దీంతో వీకెండ్ తో పోల్చుకుంటే నాల్గవ రోజైన సోమవారం కలెక్షన్స్ కొంత తగ్గుముఖం పట్టిన కూడా ఏకంగా 5.40 కోట్ల షేర్ కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాలలో అందుకోగలిగింది. దీనిని బట్టి ఈ చిత్రం ప్రేక్షకులని బాగానే ఎట్రాక్ట్ చేస్తోందని అర్ధమవుతోంది. మరల మూవీ కలెక్షన్స్ బుధవారం నుంచి పుంజుకునే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

దసరా హాలిడేస్ కలిసిరానున్న నేపథ్యంలో ఫ్యామిలీ ఆడియన్స్ తాకిడి ఎక్కువగా ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. మొదటి నాలుగు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’ మూవీ ఏకంగా 90.09 కోట్ల షేర్ కలెక్షన్స్ ని అందుకోగలిగింది. వీక్ డేస్ లో నిలకడగా కలెక్షన్స్ కొనసాగితే వారాంతానికి 100 కోట్ల షేర్ ని చాలా ఈజీగా క్రాస్ చేస్తుంది. ఈ సినిమాకి ఎన్టీఆర్ వన్ మెన్ షో, అనిరుద్ మ్యూజిక్ ప్రధాన బలంగా ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు.

సాంగ్స్ తో పాటు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో అనిరుద్ అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చారు. అందుకే కాన్సెప్ట్ బలంగా జనాల్లోకి వెళ్తోంది. ఇక ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ఈ మూవీ లాంగ్ రన్ లో ఏ మేరకు కలెక్షన్స్ అందుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలుగు రాష్ట్రాలలో ‘దేవర’ మూవీకి నాల్గవ రోజు వచ్చిన కలెక్షన్ చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయి.

నైజాం - 2.34 కోట్లు

సీడెడ్ - 1.28 కోట్లు

వైజాగ్ - 0.52 కోట్లు

తూర్పు గోదావరి - 0.23 కోట్లు

పశ్చిమ గోదావరి - 0.21 కోట్లు

కృష్ణా - 0.28 కోట్లు

గుంటూరు - 0.31 కోట్లు

నెల్లూరు - 0.23 కోట్లు

డే 4 మొత్తం కలెక్షన్స్: 5.40 కోట్లు

మొత్తం 4 రోజుల కలెక్షన్ లెక్కలు చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయి.

నైజాం - 35.38 కోట్లు

సీడెడ్ - 19.41 కోట్లు

వైజాగ్ - 9.63 కోట్లు

తూర్పు గోదావరి - 6.17 కోట్లు

పశ్చిమ గోదావరి - 4.91 కోట్లు

కృష్ణా - 5.49 కోట్లు

గుంటూరు - 8.44 కోట్లు

నెల్లూరు - 3.66 కోట్లు

మొత్తం 4 రోజుల కలెక్షన్ - 93.09 కోట్లు

Tags:    

Similar News