#NTR బి-డే.. ఫ్యాన్స్ కి న‌రాలు తెగే ట్రీట్

Update: 2020-04-14 04:10 GMT
RRR కి సంబంధించి ఒక్కో అప్ డేట్ తార‌క్ .. చ‌ర‌ణ్ అభిమానుల్లో ఉత్కంఠ పెంచుతున్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు టాప్ హీరోల్ని జ‌క్క‌న్న నువ్వా నేనా? అన్న తీరుగా ఈ మూవీలో ఎలివేట్ చేసే ప్ర‌య‌త్నం చేస్తుండ‌డంతో అభిమానుల్లో ఉత్కంఠ అంత‌కంత‌కు పెరుగుతోంది. ఆంగ్లేయుల‌పై పోరాడిన‌ ఆంధ్రా మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్‌.. నైజాం నిరంకుశ‌త్వంపై పోరాడిన‌ తెలంగాణ విప్ల‌వ వీరుడు కొమ‌రం భీమ్ పాత్ర‌లో ఎన్టీఆర్ న‌టిస్తున్నారు. ఆ ఇద్ద‌రూ క‌లిసాక ఆంగ్లేయుల‌పై ఎలాంటి తిరుగుబాటు జ‌రిగింది? అన్న‌ది ఫిక్ష‌న‌ల్ గా జ‌క్క‌న్న తెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు.

ఇప్ప‌టికే అల్లూరి సీతారామ‌రాజు పాత్ర చిత్ర‌ణ ఎలా ఉండ‌బోతోంది? అన్న‌ది చ‌ర‌ణ్ బ‌ర్త్ డే రోజున ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్ తో రివీల్ చేసేసిన జ‌క్క‌న్న త‌దుప‌రి తార‌క్ బ‌ర్త్ డే సందర్భంగా ఎలాంటి ట్రీట్ ఇవ్వ‌బోతున్నాడు? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మే 20 తార‌క్ బ‌ర్త్ డే రోజున కొమరం భీమ్ లుక్ ని లాంచ్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే జ‌క్క‌న్న మోష‌న్ పోస్ట‌ర్ కం టీజ‌ర్ ‌ని రెడీ చేసే ప‌నిలో బిజీగా వున్నార‌ట‌. అల్లూరి పాత్ర‌ని ఎన్టీఆర్ ప‌రిచ‌యం చేస్తే మ‌రి కొమ‌రం భీం పాత్ర‌ని రామ్‌చ‌ర‌ణ్ ఇంట్ర‌డ్యూస్ చేయాలి క‌దా! అందుకే చ‌ర‌ణ్ వాయిస్ తో ఈ విజువ‌ల్ ట్రీట్ ఉంటుంద‌ట‌. ప్ర‌త్యేకించి ఈ మూవీలో టైగ‌ర్ తో గిరిజ‌న వీరుడైన కొమురం భీమ్ ఫైట్ హైలైట్ గా ఉండ‌నుంది. ఆ గ్లింప్స్ ని విజువ‌ల్స్ లో చూపించేందుకు ఆస్కారం ఉంద‌ని చెబుతున్నారు. కేవ‌లం రెండు సెకన్ల పాటు మెరుపులా ఈ ఫైట్ ని చూపిస్తార‌ట‌.

చ‌ర‌ణ్ రోల్ ఇంట్ర‌డ‌క్ష‌న్ పై మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్తం అయ్యాయి. మెగా ఫ్యాన్స్ అద్భుతం అని పొగిడేసినా .. క్రిటిక‌ల్ గా కొన్ని విమ‌ర్శ‌లు ఎదుర్కోక త‌ప్ప‌లేదు. అయితే తార‌క్ పాత్ర ప‌రిచ‌యం లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా జ‌క్క‌న్న ఏం చేయ‌బోతున్నారు? అన్న‌ది ఆస‌క్తిక‌రం. ఇక ఆంగ్లేయుల కాలంలో పోలీస్ అధికారిగా చ‌ర‌ణ్ పాత్ర‌లో స‌స్పెన్స్ ఎలిమెంట్ ఇప్ప‌టికే ఆస‌క్తి రేకెత్తిస్తుంటే.. తార‌క్ ర‌క‌ర‌కాల గెట‌ప్పుల్లో సినిమా ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తాడ‌న్న ప్ర‌చారం అంత‌కంత‌క‌కు వేడెక్కిస్తోంది. మ‌రోవైపు ఆర్.ఆర్.ఆర్ సంక్రాంతికి రిలీజ‌వుతుందా లేదా? అన్న‌దానిపై రివ్యూలు చేస్తున్న జ‌క్క‌న్న మే రిలీజ్ కి వాయిదా వేసేందుకు ఆస్కారం లేక‌పోలేద‌ని .. క‌రోనా ప్ర‌భావం అంద‌రిపైనా ప‌డిన‌ట్టే.. ఈ పాన్ ఇండియా సినిమాపైనా గ‌ట్టిగానే ప‌డింద‌న్న ముచ్చ‌టా హీటెక్కిస్తోంది.
Tags:    

Similar News