రామారావుకి తారక్ ని పోటీ పెట్టాడు

Update: 2018-03-26 10:21 GMT
రకరకాల ప్రచారాల్లో భాగంగా హ్యాష్ టాగ్ పబ్లిసిటీ కూడా బాగానే క్లిక్ అవుతోంది. ఆయా హీరోల రిలీజ్ లు.. టీజర్ లు.. పుట్టిన రోజులకు స్పెషల్ హ్యాష్ ట్యాగ్స్ తో పాటు.. #WKKB లాంటివి కూడా కనిపిస్తున్నాయి. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అంటూ ఈ హ్యాష్ ట్యాగ్ ఎంతగా క్లిక్ అయిందో తెలిసిందే.

ఇప్పుడు #RRR అంటూ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్-రామారావు హీరోలుగా రూపొందే సినిమాకి ప్రచారం చేస్తున్నారు. #RRR హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం బాగానే ట్రెండింగ్ లో ఉండగా.. ఎన్టీఆర్ కు ఇది 29వ సినిమా. దీనికంటే ముందే జూనియర్ 28వ సినిమా విడుదల కావాల్సి ఉంది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో రూపొందే ఈ మూవీకి కూడా ఇలాంటిదే హ్యాష్ ట్యాగ్ ను సెట్ చేశాడు సంగీత దర్శకుడు తమన్. #TTT అంటూ కొత్త ట్యాగ్ తో ఆకట్టుకునే ట్వీట్ పెట్టాడు. దీనికి అర్ధం ఏంటంటే.. తారక్-త్రివిక్రమ్-తమన్.. ఇలా తమ ముగ్గురి కాంబినేషన్ లో మూవీ వస్తోందంటూ చెప్పుకొచ్చాడు ఎస్ ఎస్ థమన్.

#RRRని పోలిక ఉండేలాగే #TTTని సెట్ చేసినా.. ఇది కూడా ఆడియన్స్ ను.. ముఖ్యంగా యంగ్ టైగర్ ఫ్యాన్స్ ను బాగానే అలరిస్తోంది. కాకపోతే.. ఆర్ ఆర్ ఆర్ లో రామారావు అనే పేరుతో ఎన్టీఆర్ కి ప్రచారం జరుగుతుండగా.. ఇక్కడ అదే స్టార్ హీరోను తారక్ అంటూ ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. ఒకే హీరోకి వరుస సినిమాలకు వేరు పేర్లతో ప్రచారం చేస్తుండడం విచిత్రమే. హ్యాష్ ట్యాగ్స్ కోసం ఇంకెన్ని చిత్రాలు చూపిస్తారో టాలీవుడ్ జనాలు.
Tags:    

Similar News