RRR.. ఆస్కార్ అప్ డేట్ ఏంటీ?..అవ‌కాశం వుందా?

Update: 2022-11-09 09:30 GMT
టాలీవుడ్ బిగ్ స్టార్స్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలి సారి క‌లిసి న‌టించిన భారీ క్రేజీ పాన్ ఇండియా మూవీ 'RRR' ప్ర‌పంచ వ్యాప్తంగా ఏ స్థాయి సంచ‌ల‌నాలు సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ మూవీ దేశ వ్యాప్తంగానే కాకుండా వ‌ర‌ల్డ్ వైడ్ గా రికార్డు స్థాయిలో విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఇండియ‌న్ ప్రేక్ష‌కుల‌నే కాకుండా విదేశీ ప్రియుల్ని కూడా విశేషంగా ఆక‌ట్టుకుని హాట్ టాపిక్ గా మారింది.

ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యాక ఈ మూవీ మ‌రింత‌గా విదేశీ ప్రియుల‌కు చేర‌వయ్యింది. అంతే కాకుండా హాలీవుడ్ స్టార్స్ కి చేరువ‌యింది. దీంతో ఈ మూవీపై సోష‌ల్  మీడియా వేదిక‌గా హాలీవుడ్ డైరెక్ట‌ర్స్‌, రైట‌ర్స్ ట్వీట్ లు చేయ‌డం మొద‌లు పెట్టారు. దీంతో RRR వ‌ర‌ల్డ్ వైడ్ గా విదేశీ సినీ ప్రియుల్ని ఆక‌ట్టుకోవ‌డం మొద‌లు పెట్టింది. రీసెంట్ గా ఈ మూవీని జాపాన్ లోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేశారు.

సినిమాని రాజ‌మౌళితో పాటు హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ కూడా ప్ర‌మోట్ చేయ‌డంతో అక్క‌డి ప్రేక్ష‌కులు  RRR కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్ట‌డం మొద‌లు పెట్టారు. జ‌పాన్ ప్రేక్ష‌కుల‌కు ఈ మూవీ విప‌రీతంగా న‌చ్చ‌డంతో అక్క‌డ  RRR రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ విజ‌య‌వంతంగా దూసుకుపోతోంది.

ఇదిలా వుంటే ఈ మూవీని ఆస్కార్ బ‌రిలో నిల‌పాల‌ని  రాజ‌మౌళితో పాటు విదేశీ బ‌య్య‌ర్స్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఎలాగైనా వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఆస్కార్ అవార్డుల్లో  RRR అవార్డులు సాధించాల‌ని బ‌లంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

రాజ‌మౌళి గ‌త కొన్ని రోజులుగా ఈ మూవీ కోసం లాబియింగ్ ని మొద‌లు పెట్టిన విష‌యం తెలిసిందే. ఇదిలా వుంటే ఇది ఎంత వ‌ర‌కు వ‌చ్చింది. తాజా అప్ డేట్ ఏంటీ? ఇంత‌కీ  RRR కు ఆస్కార్ అకాడ‌మీ అవార్డుల్లో ప్ర‌న‌వేశించే అవ‌కాశం వుందా? అనే చ‌ర్చ మొద‌లైంది. ఈ నేఫ‌థ్యంలో తాజాగా ఓ ఆస‌క్తిక‌ర‌మైన అప్ డేట్ బ‌య‌టికి వ‌చ్చేసింది. దీంతో  RRR అభిమానులు సంబ‌రాలు చేసుకోవ‌డం మొద‌లు పెట్టారు.

RRR ని వివిధ కేట‌గిరీల్లో నామినేష‌న్ కి పంపాల‌ని మేక‌ర్స్ విశ్వ ప్ర‌యాత్నాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త తెలిసింది.  RRR బెస్ట్ మూవీ కేట‌గిరీలో నామినేష‌న్స్ ని ద‌క్కించుకునే అవ‌కాశం వుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదే నిజ‌మైతే రాజ‌మౌళి క‌ల ఫిలించిన‌ట్టేన‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్ లో వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News