ప్ర‌మాదాలు చెప్పి రావు.. మన నియంత్ర‌ణ‌లో ఏదీ లేదు!

Update: 2022-10-23 07:04 GMT
కొన్ని ప్ర‌మాదాలు చెప్పి రావు. ఇది విధి అంటూ ఫిలాస‌ఫిక‌ల్ గా మాట్లాడుతోంది న‌టి రుబీనా. దానికి కార‌ణం కూడా ఉంది. బిగ్ బాస్ 14 విజేత - బుల్లితెర‌ నటి రుబీనా దిలైక్ డ్యాన్స్ రియాలిటీ షో ఝలక్ దిఖ్లా జాలో తన తదుపరి ప్రదర్శన కోసం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్ర‌మాదానికి గురైంది. ఆమె మెడకు గాయమైంది.  రుబీనా రిహార్సల్స్ సమయంలో గాయపడిన వీడియోను పోస్ట్ చేసింది.``కొన్ని విషయాలు మా నియంత్రణలో లేవు....``అని దీనికి క్యాప్ష‌న్ ఇచ్చింది. ఆమె తన మెడపై గాయం .. కట్టును చూపుతున్న చిత్రాన్ని పోస్ట్ చేసింది. డ్యాన్సింగ్ ఫ్లోర్ పై త‌న‌ భాగస్వామి సనమ్ జోహార్ ఆమెపై నుండి దూకేందుకు ప్రయత్నించారు. అయితే రుబీనా ఆమెను వెనక్కి నెట్టడం ద్వారా సనమ్ ఢీకొట్టడంతో గాయాలు త‌ప్ప‌లేదు. అయితే డ్యాన్స్ రిహార్సల్స్ లో జరిగిన పొరపాటుతో రాబోయే ఎపిసోడ్ నుంచి విర‌మించాల్సి ఉందా? అంటే అలాంటిదేమీ లేద‌ని తెలిసింది.

టెలివిజన్ నుండి చాలా మంది సహోద్యోగులు `త్వరగా బాగ‌వ్వాలి`` అని సందేశాలు ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో నియా శర్మ- నితి టేలర్- పరాస్ కల్నావత్ కూడా ఉన్నారు. నిశాంత్ భట్- గష్మీత్ మహాజని-అమృత కన్విల్కర్-ఫైసల్ షేక్- సృతి ఝా- అదా మాలిక్ త‌దిత‌రులు ఉన్నారు. మనీష్ పాల్ హోస్ట్‌గా మాధురీ దీక్షిత్.. నోరా ఫతేహి - కరణ్ జోహార్ జడ్జింగ్ ప్యానెల్ లో ఉన్నారు. రుబీనా న‌టిగా ఎదిగేందుకు త‌న ప్ర‌య‌త్నాలు కొన‌సాగించ‌నుంద‌ని స‌మాచారం.
Tags:    

Similar News