రుద్రమదేవి డిజాస్టర్.. సూపర్ హిట్

Update: 2015-10-23 03:49 GMT
రుద్రమదేవి.. నాలుగు భాషల్లో విడుదలైన సినిమా. తెలుగులో ఈ సినిమా పరిస్థితి ఏంటి అని ఇప్పుడే ఓ అంచనాకు రాలేం. తీవ్ర పోటీ ఉన్నప్పటికీ బ్రేక్ ఈవెన్‌ కు రావడానికి శతదా ప్రయత్నిస్తోంది గుణశేఖర్ సినిమా. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.40 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసింది తెలుగు వెర్షన్. ఇంకా రన్ కొనసాగుతోంది కాబట్టి.. పూర్తిగా థియేటర్ల నుంచి తీసేశాక తెలుగు వెర్షన్ మీద ఓ అంచనాకు రావచ్చు. మరి రుద్రమదేవి మిగతా వెర్షన్ల సంగతేంటి అంటే ఒక్కో చోట ఒక్కలా ఉంది పరిస్థితి.

‘రుద్రమదేవి’ హిందీ వెర్షన్ ను అభిషేక్ పిక్చర్స్ - రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ కలిసి రూ.5 కోట్లకు కొన్నాయి. విడుదల భారీగానే చేశారు కానీ.. సినిమాను జనాలు పట్టించుకోలేదు. గ్రాస్ వసూళ్లు రూ.3 కోట్ల దాకా వచ్చాయి కానీ.. షేర్ అందులో సగం కూడా లేదు. అనుష్క - రానా లాంటి ‘బాహుబలి’ తారలున్నా ఈ సినిమా అక్కడి ప్రేక్షకులకు పట్టలేదు. దీంతో రుద్రమదేవి హిందీ వెర్షన్ డిజాస్టర్ అని తేలిపోయింది.

ఇక మలయాళ వెర్షన్ సంగతి చూస్తే.. శాటిలైట్ రైట్స్ తో కలిపి సినిమాను రూ.1.1 కోట్లకు అమ్మారు. అల్లు అర్జున్ క్రేజ్ అక్కడ బాగా కలిసొచ్చింది. సినిమా రూ.కోటి రూపాయలకు పైనే వసూలు చేసింది. దాదాపుగా పెట్టుబడి అంతా ఇక్కడే వచ్చేయడంతో శాటిలైట్ ద్వారా వచ్చేదంతా లాభమే. కాబట్టి మలయాళ వెర్షన్ సూపర్ హిట్ అన్నట్లే.

ఇక తమిళ వెర్షన్ విషయానికొస్తే.. తెలుగుతో పాటే నేరుగా విడుదల చేసి ఉంటే.. మంచి లాభాలు అందుకునేవాడు అక్కడి డిస్ట్రిబ్యూటర్. కానీ వారం లేటుగా రిలీజ్ చేశాడు. అయినప్పటికీ చాలామంచి స్పందన వచ్చింది. గత వారం చెప్పుకోదగ్గ తమిళ సినిమాలు కూడా లేకపోవడంతో కోలీవుడ్ బాక్సాఫీస్‌ లో నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది ‘రుద్రమదేవి’. ఐతే ఈ వారం రెండు పెద్ద సినిమాలు రావడంతో ఈ సినిమా డల్ అయిపోయింది. అయినప్పటికీ ఇప్పటికే దాదాపుగా బయ్యర్లందరూ లాభాల్లోకి వచ్చేశారట. శాటిలైట్ కూడా కలిపి రూ.10 కోట్లకు అమ్మాడు గుణశేఖర్. అక్కడివాళ్లకు బాగానే వర్కవుటైంది. తమిళ వెర్షన్ ను కూడా హిట్ లెక్కలోకి వేసేయొచ్చు.
Tags:    

Similar News