తెలంగాణ నేపథ్యం ఉన్న కథ కావడం వల్ల కావచ్చు.. దిల్ రాజు భారీగా విడుదల చేయడమే కాక బాగా ప్రమోట్ చేయడం వల్ల కావచ్చు.. నైజాం ఏరియాలో ‘రుద్రమదేవి’ సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాహుబలి, శ్రీమంతుడు లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ల తర్వాత నైజాంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు నెలకొలిపింది ఈ సినిమా.
మూడో వీకెండ్ ముగిసేసరికి నైజాంలో రుద్రమదేవి రూ.20.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. పన్ను మినహాయింపు వల్ల ఇక్కడ షేర్ కూడా బాగానే వచ్చింది. రూ.14.24 కోట్ల షేర్ నేరుగా డిస్ట్రిబ్యూటర్ ఖాతాలోకి వెళ్లిందది. దిల్ రాజు ఈ సినిమాను రూ.12 కోట్లకు కొన్న సంగతి తెలిసిందే. అంటే ఇప్పటికే నైజాంలో రూ.2.24 కోట్ల లాభం వచ్చిందన్నమాట. ఈ ఏరియాలో ఇప్పటికీ బాగానే ఆడుతోంది ‘రుద్రమదేవి’. థియేటర్లు బాగానే ఇచ్చారు.
మొత్తంగా చూస్తే రుద్రమదేవి ఇప్పటిదాకా రూ.81.77 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిందది. షేర్ రూ.48.42 కోట్లు వచ్చింది. ఇది తెలుగు - తమిళ - హిందీ - మలయాళ భాషలన్నీ కలిపి ప్రపంచ వ్యాప్తంగా ‘రుద్రమదేవి’ సాధించిన షేర్. ఏపీ - నైజాం కలిపి ‘రుద్రమదేవి’ రూ.47 కోట్ల గ్రాస్.. రూ.32.87 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. మొత్తంగా రుద్రమదేవి షేర్ రూ.55 కోట్లకు చేరే అవకాశముంది.